కోహ్లీ గొప్పోడు అని చెప్పడానికి సచిన్ రికార్డులే అవసరం లేదు! రికీ పాంటింగ్ ప్రశంస..
‘క్రికెట్ గాడ్’గా గుర్తింపు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ రికార్డులను ఒక్కొక్కరికీ బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు విరాట్ కోహ్లీ. 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు..
‘ఇప్పుడు విరాట్ కోహ్లీని చూస్తుంటే తన మ్యాజిక్ స్టిక్ దొరికించుకున్న మేజిషియన్‌లా కనిపిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ, టీమిండియాకి కీ ప్లేయర్. కీలక సమయంలో కోహ్లీ ఫామ్‌లోకి రావడం, భారత జట్టుకి బాగా కలిసి వస్తోంది..
Virat Kohli
విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేయడానికే ఆడుతున్నాడని చాలా మంది అంటున్నారు. అయితే నా ఉద్దేశంలో విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్ అని నిరూపించుకోవడానికి సచిన్ టెండూల్కర్ రికార్డులే అవసరం లేదు..
ఇప్పటికే విరాట్ కోహ్లీ ఎంతో సాధించాడు. సచిన్ టెండూల్కర్ కంటే 175 తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు చేశాడు. ఇది అంత ఈజీగా వచ్చింది కాదు. దీని వెనక చాలా శ్రమ ఉంది..
అతని ఓవరాల్ బ్యాటింగ్ రికార్డు అసాధారణం. ఇంతకుముందు ఏ యంగ్ ప్లేయర్ అయినా బాగా ఆడితే సచిన్ టెండూల్కర్ రికార్డులను ప్రామాణీకంగా తీసుకునేవాళ్లు. ఇకపై విరాట్ కోహ్లీ రికార్డులను కూడా తీసుకుంటారు..
Virat Kohli-Shreyas Iyer
సెమీ ఫైనల్‌కి ముందు భారత జట్టు మరో మ్యాచ్ ఆడనుంది. ఆ రోజు విరాట్ కోహ్లీ ఆడితే 50వ సెంచరీ కొట్టడానికి చక్కని సమయం దొరికినట్టే.
నేను చూసిన బెస్ట్ ప్లేయర్లలో విరాట్ ఒకడు. ఇది నేను చాలా ఏళ్ల క్రితమే చెప్పాను..’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్..