- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ నీ వల్ల కాదు, ఇకనైనా కెప్టెన్సీ నుంచి తప్పుకో... గౌతమ్ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు...
విరాట్ కోహ్లీ నీ వల్ల కాదు, ఇకనైనా కెప్టెన్సీ నుంచి తప్పుకో... గౌతమ్ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు...
IPL 2020 సీజన్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత మారలేదు. 13 సీజన్లుగా టైటిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకి మరోసారి నిరాశే మిగిలింది. అదృష్టం కొద్ది ఎలాగోలా ప్లేఆఫ్ చేరిన ఆర్‌సీబీ, ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి నాలుగోస్థానానికి పరిమితమైంది.

2011 సీజన్‌లో డానియల్ వెటోరి నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు విరాట్ కోహ్లీ...

అప్పటి నుంచి తొమ్మిది సీజన్లుగా జట్టుకు టైటిల్ అందించాలని శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు విరాట్ కోహ్లీ...

క్రిస్ గేల్, షేన్ వాట్సన్, స్టోయినిస్, ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ లాంటి హిట్టర్లు ఉండి కూడా ఆర్‌సీబీ టైటిల్ గెలవలేకపోయింది...

ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత అత్యధిక పరాజయాలు అందుకున్న జట్టుగా నిలిచి, అత్యంత పేలవమైన రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిటే ఉంది.

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ అయిన తర్వాత ఢిల్లీ సంచలన విజయాలు అందుకుంటుంటే, ఆర్‌సీబీ మాత్రం సరైన విజయాలు అందుకోలేకపోయింది.

గత సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది....

2020 సీజన్ ఫస్ట్ హాఫ్‌లో 10 మ్యాచుల్లో ఏడు మ్యాచులు గెలిచిన రాయల్ ఛాలెంజర్స్... ఆ తర్వాత గాడి తప్పింది. వరుస మ్యాచుల్లో ఓడి, ఈసారి కూడా టైటిల్‌కి మూడు అడుగుల దూరంలో నిలిచిపోయింది.

‘విరాట్ కోహ్లీ 8 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్‌ను నడిపిస్తున్నారు. ఒక్కసారి కూడా టైటిల్ అందించలేకపోయాడు. ఇది చాలా దారుణమైన రికార్డు. టైటిల్ గెలవకుండా ఎనిమిదేళ్లుగా కెప్టెన్‌గా కొనసాగుతున్నవారు వేరే ఎవ్వరైనా ఉన్నారా... మరి విరాట్ కోహ్లీని మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్.

‘విరాట్ కోహ్లీ బాధ్యత వహించి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి... ’ అంటూ కోహ్లీని విమర్శించాడు గౌతమ్ గంభీర్. కేకేఆర్ కెప్టెన్‌గా కొనసాగిన గౌతమ్ గంభీర్... రెండుసార్లు కోల్‌కత్తాను ఛాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌నే చూసుకోండి. వాళ్లు రవిచంద్రన్ అశ్విన్‌కి కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత రెండేళ్లు కూడా ఆగలేకపోయారు. రెండు సీజన్లు ముగియగానే కెప్టెన్సీ నుంచి తప్పించారు... ఎనిమిదేళ్లంటే చాలా ఎక్కువ సమయం... అంటూ వ్యాఖ్యానించాడు గంభీర్.

ధోనీ గురించి, రోహిత్ శర్మ గురించి మాట్లాడినట్టే విరాట్ కోహ్లీ గురించి కూడా చెబుతాం. కానీ వీళ్లు ముగ్గురూ ఒక్కటి కాదు. రోహిత్ శర్మ నాలుగు సార్లు టైటిల్ గెలిస్తే, ధోనీ మూడు సార్లు సీఎస్‌కేని ఛాంపియన్‌గా నిలిపాడు. కోహ్లీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోయాడు...

రోహిత్ శర్మ ఇన్నేళ్లలో టైటిల్ గెలవకపోయి ఉంటే, తప్పుకుండా కెప్టెన్సీని వదులుకునేవాడు. లేదంటే ముంబై జట్టే అతన్ని కెప్టెన్‌గా తప్పించేది. ఒక్కోక్కరితో ఒక్కోలా వ్యవహారించకూడదు.

నువ్వు లీడర్‌వి... నువ్వు కెప్టెన్‌వి. జట్టుకి విజయాలు వచ్చినప్పుడు ఆ క్రెడిట్ మొత్తం నువ్వే తీసుకుంటావు... మరి ఇన్నేళ్లుగా నీ జట్టు ఓడిపోతోంది... ఎవ్వరిది బాధ్యత? అంటూ ప్రశ్నించాడు గౌతమ్ గంభీర్.

2020 సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్లేఆఫ్‌లో ఉండే అర్హత కూడా లేదన్నాడు గౌతమ్ గంభీర్...

విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అభిమానించేవారిని అవమానించినట్టే అని చెప్పాడు గౌతమ్ గంభీర్. ఇదిలా ఉండే 2013 సీజన్‌లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. కోహ్లీ అవుటైన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్న కోల్‌కత్తా ప్లేయర్లపై నోరుపారేసుకున్నాడు విరాట్. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి గంభీర్, కోహ్లీ కొట్టుకుంటారేమోననే రేంజ్‌కి వెళ్లింది.