- Home
- Sports
- Cricket
- టీ20లు సరే, వన్డేల్లో ఓపెనర్ పరిస్థితి ఏంటి... శిఖర్ ధావన్‌కు ఛాన్స్ దొరుకుతుందా?...
టీ20లు సరే, వన్డేల్లో ఓపెనర్ పరిస్థితి ఏంటి... శిఖర్ ధావన్‌కు ఛాన్స్ దొరుకుతుందా?...
టెస్టులు, టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా, వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఆఖరి టీ20లో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ, ఓపెనర్‌గా కొనసాగుతానని చెప్పినా, వన్డేల్లో మాత్రం ఆ సాహసం చేయకపోవచ్చని అంచనా...

వన్‌డౌన్ ప్లేయర్‌గా విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 18 నెలలుగా టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ... వన్డేల్లో ఇప్పటికే 43 సెంచరీలు చేశాడు...

సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన అత్యధిక వన్డే సెంచరీల రికార్డుకు అధిగమించడానికి విరాట్ కోహ్లీకి ఇంకా 7 సెంచరీలు కావాలి. వన్డేల్లో సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసింది కోహ్లీయే...

అంతర్జాతీయ క్రికెట్‌లో 15 నెలలుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ... వన్డే సిరీస్‌లో ఆ లోటు తీరుస్తాడని ఆశిస్తున్నారు అతని అభిమానులు...

అయితే తనకి అచొచ్చిన వన్‌డౌన్ ప్లేస్‌లో దిగడానికి విరాట్ కోహ్లీ ప్రాధాన్యం ఇస్తాడా? లేక ఆ అవకాశాన్ని వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్‌కి ఇస్తాడా? అనేది తెలియాల్సి ఉంది...

విజయ్ హాజారే ట్రోఫీలో రాణించిన శిఖర్ ధావన్ మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. వన్డేల్లో ఎంతో అనుభవం ఉన్న శిఖర్ ధావన్, ఘనమైన రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు...

మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. లేదంటే ‘గబ్బర్’కి మరో అవకాశం ఇవ్వడం వృథా అని టీమిండియా భావిస్తే, ఆస్ట్రేలియా టూర్‌లో ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్ చేయించే అవకాశం ఉంది...

టీ20 సిరీస్‌లో ఫెయిల్ అయినప్పటికీ కెఎల్ రాహుల్‌కి వన్డే సిరీస్‌లో మరో అవకాశం తప్పక దక్కుతుంది. అయితే అతను రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడా? లేక మిడిల్ ఆర్డర్‌లో వస్తాడా? అనేది తెలియాల్సి ఉంది...

మొత్తానికి వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేందుకు నలుగురు ప్లేయర్లు పోటీపడుతున్నారు. వీరిలో శుబ్‌మన్ గిల్ మొదటి వన్డేలో అవకాశం దక్కించుకుని రాణిస్తే... మిగిలిన వారికి అవకాశం రాకపోవచ్చు...

నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరిలో ఒకరు ఆడడం కన్ఫార్మ్ అయితే అదనపు బౌలర్ ఆప్షన్‌ను టీమిండియా పక్కనబెట్టాల్సిందే...

టీ20 సిరీస్‌లో రాణించిన భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్‌తో పాటు యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకి అవకాశం దక్కొచ్చు. నటరాజన్, సిరాజ్‌లను ఆడించాలంటే వీరిలో ఒకరిని పక్కనబెట్టాలి.

యజ్వేంద్ర చాహాల్ ఫామ్‌లో లేడు, సుందర్ కూడా ఆఖరి రెండు టీ20ల్లో ఫెయిల్ అయ్యాడు. అయినా ఈ ఇద్దరికీ వన్డేల్లో ప్రాధాన్యం దక్కొచ్చు. కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసినా, తుది జట్టులో అవకాశం ఇవ్వరనేది అతనికి కూడా అర్థమైంది...

వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టుతో తలబడబోతోంది టీమిండియా. కాబట్టి అందుకు తగ్గట్టుగా బెస్ట్ ఎలెవన్‌తో బరిలో దిగాలని చూస్తోంది. టెస్టు, టీ20ల్లో ఓడినట్టు మొదటి మ్యాచ్ ఓడిస్తే, మూడు వన్డేల సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టమవుతుంది... కాబట్టి తొలిసారి మ్యాచ్‌లో గెలిచి, సిరీస్ క్లీన్‌స్వీప్ చేస్తే భారత జట్టు వన్డే ర్యాంకు మెరుగవుతుంది.