సచిన్ టెండూల్కర్, ధోనీ, అజారుద్దీన్, యువరాజ్... ఆ లిస్టులోకి విరాట్ కోహ్లీ...
ఫామ్‌లో లేడని కొందరు ట్రోల్స్ చేస్తున్నా, ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి రికార్డుల ప్రవాహం మాత్రం ఆగడం లేదు. సెంచరీలు రాకున్నా, తన స్టైల్‌లో పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు విరాట్ కోహ్లీ...

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ...
2019 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ వన్డేల్లో 50.35 సగటుతో 1007 పరుగులు చేస్తే, కెఎల్ రాహుల్ 881 పరుగులు, శిఖర్ ధావన్ 794, శ్రేయాస్ అయ్యర్ 657 వన్డే పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు...
2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో 11 సెంచరీలు చేసి టీమిండియా తరుపున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు...
వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరగబోయే రెండో వన్డే, విరాట్ కోహ్లీకి స్వదేశంలో 100వ వన్డే మ్యాచ్ కావడం విశేషం...
ఇప్పటిదాకా 258 వన్డే మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, స్వదేశంలో 99 వన్డే మ్యాచులు ఆడాడు. వెస్టిండీస్‌తో జరిగే రెండో వన్డే, విరాట్‌కి 259 వన్డే కాగా, స్వదేశంలో 100వ వన్డే...
మొదటి వన్డేలో రెండు ఫోర్లతో 8 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తర్వాత స్వదేశంలో 5 వేలకు పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
స్వదేశంలో 100కి పైగా వన్డేలు ఆడిన 36వ క్రికెటర్‌గా నిలవబోతున్న విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ సాధించబోతున్న ఐదో భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు...
ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ (164 వన్డేలు), ఎమ్మెస్ ధోనీ (127), మహ్మద్ అజారుద్దీన్ (113), యువరాజ్ సింగ్ (108) మాత్రమే స్వదేశంలో నూరుకి పైగా వన్డేలు ఆడారు...
స్వదేశంలో 99 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, 96 ఇన్నింగ్స్‌ల్లో 60 సగటుతో 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...