పోలీస్ కస్టడీలో విరాట్ కోహ్లీ కారు... కారు కొని స్కామ్‌లో ఇరుక్కున్న సాగర్...

First Published Dec 13, 2020, 12:44 PM IST

ప్రపంచంలోనే అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రికెటర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారతీయుడిగా, ఆసియా మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ... అనేక బ్రాండ్లకి అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్నాడు. అయితే విరాట్ కోహ్లీ మొట్టమొదటి కారు పోలీస్ స్టేషన్‌కి చేరిందట. అయితే దీని వెనక చాలా పెద్ద కథే ఉంది...

సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్న ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ... ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో బిజీగా ఉన్నాడు...

ప్రస్తుతం ఆస్ట్రేలియా ఏ జట్టుతో మూడు రోజుల డే నైట్ ప్రాక్టీస్ టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు, డిసెంబర్ 17 నుంచి మొదటి టెస్టు ఆడబోతోంది...

ఆడిలైడ్‌లో జరిగే ఈ మొట్టమొదటి ఇండియా, ఆస్ట్రేలియా డే నైట్ టెస్టు ముగిసిన తర్వాత... పితృత్వ సెలవుల కింద స్వదేశానికి రానున్నాడు విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీకి కార్లంటే పిచ్చి. ‘Audi’ ఇండియా బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్న విరాట్, మార్కెట్‌లోకి ఏ కొత్త కారు వచ్చినా దాన్ని కొనుగోలు చేస్తుంటాడు...

‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన క్రికెటర్లకు ఇప్పుడు ‘ఆడి’ కార్లను బహుమతులుగా ఇస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా కార్లు విరాట్ కోహ్లీ ఇంటికి వచ్చి చేరాయి...

2012లో మొట్టమొదటిసారి ఆడి R8 కారును ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు విరాట్ కోహ్లీ... అప్పట్లోనే రూ.కోటి 70 లక్షలు విలువ చేసే ఈ కారును నాలుగేళ్ల తర్వాత అమ్మేశాడు విరాట్...

2016లో విరాట్ కోహ్లీ వాడిన కారుకి రూ.2 కోట్ల 50 లక్షలు పెట్టి మరీ కొనుగోలు చేశాడు సాగర్ థక్కర్ అనే వ్యాపారస్తుడు...

విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన తన గర్ల్ ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇచ్చే ఉద్దేశంతోనే ఈ కారును కొనుక్కున్నాడు సాగర్ థక్కర్...

అయితే కారు వచ్చిన వేలావిశేషం ఏంటో కానీ, ఆ తర్వాత రెండు నెలలకే ఓ భారీ స్కామ్‌లో ఇరుక్కున్నాడు సాగర్ థక్కర్...

దాంతో పోలీసులకు దొరక్కుండా అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోయిన సాగర్ థక్కర్ కోసం నాలుగేళ్లుగా గాలిస్తున్నారు మహారాష్ట్ర పోలీసులు...

ఎంతకీ సాగర్ ఆచూకీ దొరకకపోవడంతో అతని ఆస్తులపై దాడులు చేశారు మహారాష్ట్ర పోలీసులు. అతని ఇంటితో పాటు ఎంతో ముచ్ఛటపడి కొనుక్కున్న కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇలా విరాట్ కోహ్లీ కొనుగోలు చేసిన మొదటి కారు, పోలీసు స్టేషన్‌కి చేరింది. అయితే కారుకి సంబంధించిన ట్రాన్స్‌ఫర్ వర్క్ మొత్తం ముగియడంతో విరాట్ కోహ్లీకి ఎలాంటి సమస్యా రాలేదు.. ఆయన కారు మాత్రం పోలీస్ స్టేషన్‌లో దుమ్ముపట్టిపోతోంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?