విరాట్ కోహ్లీ తనని తాను రొనాల్డో అనుకుంటాడు, కానీ కాదు.. యువరాజ్ సింగ్ ఫన్నీ కామెంట్స్..
కెరీర్ ఆరంభంలో విరాట్ కోహ్లీని బాగా ఎంకరేజ్ చేసిన సీనియర్లలో యువరాజ్ సింగ్ కూడా ఒకడు. మాహీ, సెహ్వాగ్, గంభీర్.. ఇలా సీనియర్లు అందరూ కోహ్లీకి అండగా నిలిచారు. తాజా ఇంటర్వ్యూలో విరాట్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు యువరాజ్ సింగ్..
‘విరాట్ కోహ్లీకి, నాకు ఎప్పుడూ ఫుట్‌బాల్ దగ్గరే గొడవ వస్తుంది. నేను, ఆశీష్ నెహ్రా కూడా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో చాలా గొడవ పడ్డాం. ఓ సారి వీరేంద్ర సెహ్వాగ్‌తో కూడా..
kohli yuvraj
విరాట్ ఎప్పుడూ తన ఫుట్‌బాల్ స్కిల్స్, క్రిస్టియానో రొనాల్డోతో సమానం అని అనుకుంటాడు. అయితే అతను రొనాల్డో కాదు, ఎందుకంటే తన కంటే నేను మంచి ఫుట్‌బాలర్‌ని...
అతనికి స్కిల్స్ ఉన్నాయి కానీ నా కంటే మంచి ఫుట్‌బాలర్ అయితే కాదు. ఇంతకుముందు విరాట్, నేనూ తరుచుగా మాట్లాడుకునేవాళ్లం. కానీ ఇప్పుడతను చాలా బిజీ అయిపోయాడు..
కుర్రాడిగా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీని చీకూ అనేవాళ్లం. ఈరోజు చీకూ, విరాట్ కోహ్లీ అయ్యాడు. అందులో చాలా పెద్ద తేడా ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్..
‘ధోనీ, నేను ఎప్పుడూ క్లోజ్ ఫ్రెండ్ కాదు. అతని లైఫ్ స్టైల్, నా లైఫ్ స్టైల్ పూర్తిగా వేరు. అందుకే మేం ప్రొఫెషనల్ ఫ్రెండ్స్‌గా కలిసి ఆడాం అంతే. మా ఇద్దరి బంధం ఎప్పుడూ బలపడలేదు..’ అంటూ మాహీ గురించి కూడా కామెంట్ చేశాడు యువీ..