- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ ఒక్కడిని త్వరగా అవుట్ చేస్తే, మ్యాచ్ గెలవచ్చని పాక్ తెలుసుకుంది.. - మహ్మద్ కైఫ్
విరాట్ కోహ్లీ ఒక్కడిని త్వరగా అవుట్ చేస్తే, మ్యాచ్ గెలవచ్చని పాక్ తెలుసుకుంది.. - మహ్మద్ కైఫ్
గత రెండేళ్లలో టీమిండియా - పాకిస్తాన్ మధ్య నాలుగు మ్యాచులు జరిగాయి. రెండు మ్యాచుల్లో పాకిస్తాన్ గెలిస్తే, మరో రెండు మ్యాచుల్లో టీమిండియా గెలిచింది. అయితే ఈ నాలుగు మ్యాచుల్లోనూ టీమిండియా తరుపున టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీయే..

2021 టీ20 వరల్డ్ కప్‌లో హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన విరాట్ కోహ్లీ, 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఒంటిచేత్తో టీమిండియాకి విజయాన్ని అందించాడు. ఆసియా కప్ 2022లోనూ టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు విరాట్..
2022 టీ20 వరల్డ్ కప్‌లో హారీస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది, మ్యాచ్‌ని మలుపు తిప్పాడు విరాట్ కోహ్లీ. ఈ మధ్యకాలంలో విరాట్ కోహ్లీ నుంచి వచ్చిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే..
సెప్టెంబర్ 2న ఆసియా కప్‌లో మరోసారి ఇండియా - పాకిస్తాన్ తలబడబోతున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 14న వన్డే వరల్డ్ కప్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచుల్లోనూ పాకిస్తాన్ మెయిన్ టార్గెట్ విరాట్ కోహ్లీయే..
‘టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ పర్ఫామెన్స్ అత్యద్భుతం. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ అద్భుతంగా అదరగొడతాడు. ఛేదనలో అతను పూర్తి బాధ్యతలు తీసుకుని ఆడతాడు. అందుకే కోహ్లీ ఛేజ్ మాస్టర్ అయ్యాడు..
Virat Kohli
ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు విరాట్ కోహ్లీ పెద్దగా ఫామ్‌లో లేడు. మూడేళ్లుగా సెంచరీ కూడా చేయలేకపోయాడు. టీ20 టీమ్‌లో విరాట్ కోహ్లీ ఉండడమే వేస్ట్ అనే ట్రోల్స్ కూడా వినిపించాయి. అయితే ఇవేమీ విరాట్ కోహ్లీని ఆపలేకపోయాయి..
Image credit: PTI
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై మ్యాచ్‌ని వీరోచిత పోరాటంతో గెలిపించాడు. ఈ మూమెంట్స్‌ని పాకిస్తాన్ బౌలర్లు అంతా ఈజీగా మరిచిపోరు. వాళ్లకి ఇప్పటికే విరాట్ కోహ్లీ వికెట్ ఎంత ముఖ్యమో అర్థమై ఉంటుంది. విరాట్ కోహ్లీ ఒక్కడిని అవుట్ చేస్తే, మ్యాచ్ ఈజీగా గెలవచ్చని కూడా వాళ్లు అర్థం చేసుకుని ఉంటారు..
అయితే విరాట్ కోహ్లీ ఉన్న ఫామ్, పాకిస్తాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేయొచ్చు. పాక్ బౌలర్లు నసీం షా, షాహీన్ ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్... అందర్నీ విరాట్ ఓ ఆటాడుకున్నాడు.
Image credit: PTI
వాళ్లను ఎలా ఫేస్ చేయాలో విరాట్‌కి బాగా తెలుసు. పాకిస్తాన్ కచ్చితంగా విరాట్ కోహ్లీ కోసం కౌంటర్ అటాక్ తయారుచేస్తుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్..