నెం.1 బ్యాట్స్‌మెన్‌గా 1500 రోజులు... భారత సారథి విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు...

First Published Feb 4, 2021, 11:44 AM IST

భారత సారథి విరాట్ కోహ్లీ వన్డే నెం.1 బ్యాట్స్‌మెన్‌గా 1500 రోజులను పూర్తిచేసుకున్నాడు. 2013, నవంబర్ 3న తొలిసారిగా వన్డేల్లో నెం.1 ర్యాంకును కైవసం చేసుకున్న విరాట్ కోహ్లీ... 2017 నుంచి వరుసగా నాలుగేళ్లుగా టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు.