MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ ఎంట్రీకి 13 ఏళ్లు... ‘కింగ్‌’ కోహ్లీకి ఎందుకని ఇంతమంది హేటర్స్, అదీకూడా ఇక్కడే..

విరాట్ ఎంట్రీకి 13 ఏళ్లు... ‘కింగ్‌’ కోహ్లీకి ఎందుకని ఇంతమంది హేటర్స్, అదీకూడా ఇక్కడే..

విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచంలో ఇది కేవలం ఓ పేరు మాత్రమే కాదు, బ్రాండ్... అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేస్తూ, సెంచరీలు ఇంత సులువుగా చేయొచ్చా? అని క్రికెట్ లెజెండ్స్‌ను కూడా ఆశ్చర్యపోయేలా చేసిన రన్‌మెషిన్... విరాట్ కోహ్లీ క్రికెట్ ఎంట్రీకి సరిగ్గా 13 ఏళ్లు నిండాయి...

3 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 18 2021, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116

2008లో అండర్‌-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీకి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అదే ఏడాది ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు విరాట్ కోహ్లీ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
216

కేవలం 8 లిస్టు ఏ మ్యాచులు మాత్రమే ఆడిన అనుభవం ఉన్న విరాట్ కోహ్లీని భారత జట్టుకి ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...  అయితే భారత ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ గాయపడడంతో ఓపెనర్‌గా కోహ్లీకి అవకాశం దక్కింది...

316

19 ఏళ్ల వయసులో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ, తన తొలి మ్యాచ్‌లో 12 పరుగులకే అవుట్ అయ్యాడు. అదే సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న కోహ్లీ, భారత జట్టుకి సిరీస్ విజయాన్ని అందించాడు.

416

ఆ తర్వాత శిఖర్ ధావన్ గాయపడడంతో 2009లో ఆస్ట్రేలియా ఏతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఏ తరుపున ఆడాడు విరాట్ కోహ్లీ. అందులో 49 పరుగులు చేసి ఆకట్టుకున్న విరాట్‌.. ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తరుపున 105 పరుగులు చేసి అదరగొట్టాడు. బ్రెట్‌లీ, స్టువర్ట్ క్లార్క్, మిచెల్ జాన్సన్ వంటి ఆసీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీ చేసిన విరాట్‌కి టీమిండియా నుంచి మరోసారి పిలుపు వచ్చింది...

516

శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో గౌతమ్ గంభీర్ గాయపడడం, 2009 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో యువరాజ్ సింగ్ గాయపడడంతో వారి స్థానాల్లో తుదిజట్టులో చోటు దక్కించుకున్న విరాట్ కోహ్లీ... సత్తా చాటి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో విండీస్‌పై79 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు కోహ్లీ...

616

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో గౌతమ్ గంభీర్‌తో కలిసి 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, 111 బంతుల్లో 107 పరుగులు చేసి తొలి వన్డే సెంచరీ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 150 పరుగులు చేసిన గంభీర్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కితే, దాన్ని కోహ్లీకి అందించాడు గౌతీ...

716

అక్కడి నుంచి మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు కోహ్లీకి... విండీస్ టూర్‌లో ధోనీ గాయపడడంతో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ... సారథిగా తన రెండో వన్డేలోనే సెంచరీతో చెలరేగాడు. జింబాబ్వే టూర్‌లో ఐదు వన్డేలను క్లీన్‌స్వీప్ చేసి... భారత్‌కి మొట్టమొదటి విదేశీ క్లీన్‌స్వీప్ వన్డే విజయాన్ని అందించాడు.

816

స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్ వంటి ప్లేయర్లు టెస్టుల్లో... డేవిడ్ వార్నర్, బట్లర్, ఆరోన్ ఫించ్, బాబర్ ఆజమ్ వంటి ప్లేయర్లు వన్డే, టీ20 ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తుంటే... విరాట్ కోహ్లీ ఒక్కడే ఏ ఫార్మాట్‌ అనేదాంతో సంబంధం లేకుండా రికార్డుల మోత మోగించాడు...

916

టెస్టుల్లో 27 సెంచరీలు, వన్డేల్లో 43 సెంచరీలతో 70 అంతర్జాతీయ శతకాలు అందుకున్న విరాట్ కోహ్లీ, ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్, ఫాలోయింగ్ అందుకున్నాడు. అయితే ఎన్ని విజయాలు అందిస్తున్నా, మనదేశంలో విరాట్ కోహ్లీకి అభిమానుల కంటే విమర్శకులు ఎక్కువ...

1016

దీనికి కారణం విరాట్ కోహ్లీ అగ్రెసివ్ యాటిట్యూడ్ కారణం అని కొందరంటే, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మల కంటే ఎక్కువ పరుగులు చేస్తూ వారిని మించిన స్టార్‌డమ్ తెచ్చుకోవడం... ఆ ఇద్దరు క్రికెటర్ల అభిమానులు తట్టుకోలేకపోతున్నారంటూ మరికొందరు అంటారు...

1116

రోహిత్ శర్మకు కెప్టెన్సీ దక్కకుండా విరాట్ కోహ్లీ అడ్డుగా ఉన్నాడని, ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్ అతనిపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్‌కి టీ20 కెప్టెన్సీ ఇవ్వాలనేది వారి వాదన. 

1216

అయితే ఐపీఎల్‌, ఇంటర్నేషనల్ క్రికెట్ ఒకటి కాదు. భారత జట్టు ఆఖరిగా ఓడిపోయిన టీ20 సిరీస్‌లు రెండూ కూడా ఒకటి రోహిత్ శర్మ కెప్టెన్సీలోది, మరోకటి శిఖర్ ధావన్ కెప్టెన్సీలోది. అదీకాకుండా ఐపీఎల్‌లో అదరగొట్టిన దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లు, అంతర్జాతీయ మ్యాచుల్లో ఎలా ఆడాలో తెలిసిందే...

1316

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా... నేటితరంలో విరాట్ కోహ్లీ ఓ మోడ్రన్ లెజెండ్. ఇప్పటికే అతను భారత జట్టుకి ఎంతో చేశాడు. కొన్నాళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నా... భారత జట్టులో తన అగ్రెషన్‌ను నింపడంలో 100% సక్సెస్ అయ్యాడు...

1416

లార్డ్స్ టెస్టులో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నా, లేదా మరేవరైనా కెప్టెన్ ఉన్నా... జట్టులో ఇంతటి కసి తీసుకొచ్చేవారు కాదనేది వాస్తవం. విజయాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో, సక్సెస్ కోసం ఎంత కసిగా ఆడాలో టీమ్‌కి నేర్పించాడు విరాట్ కోహ్లీ...

1516

అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్‌గా టాప్ 4లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. విదేశాల్లో విజయాలు అందుకోలేకపోయిన మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును ఎప్పుడో దాటేశాడు. ధోనీ కెప్టెన్సీలో వరుస పరాజయాలతో ఏడో స్థానానికి పడిపోయిన టీమిండియాను... వరుసగా ఐదేళ్లు టాప్‌లో నిలిపాడు...

1616

ఇలా ఎన్నో మరెన్నో విరాట్ కోహ్లీ ఇప్పటికే టీమిండియాకి చాలా చేశాడు. అయితే అతనికి ఇక్కడ అభిమానుల కంటే హేటర్సే ఎక్కువ. క్రికెట్ ప్రపంచంలో మాత్రం కోహ్లీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో కోహ్లీ ఫాలోయింగ్ చూస్తే, మతి పోవాల్సిందే.

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved