- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ రానని చెప్పాడు, అతన్ని అక్కడ చూడగానే... హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్...
విరాట్ కోహ్లీ రానని చెప్పాడు, అతన్ని అక్కడ చూడగానే... హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్...
ఐపీఎల్ పర్ఫామెన్స్‌తో బీసీసీఐ సెలక్టర్లను ఆకట్టుకుని, టీమిండియాలో కీలక సభ్యుడిగా మారిపోయాడు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్. ఆర్‌సీబీ ప్లేయర్‌గా అదరగొట్టిన సిరాజ్ మియా, తన సక్సెస్ క్రెడిట్ మొత్తం విరాట్ కోహ్లీకే ఇస్తాడు...

ఐపీఎల్ 2022 సీజన్ కోసం హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ని రూ.7 కోట్లకు రిటైన్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో కూడా రీఎంట్రీ ఇచ్చిన మహ్మద్ సిరాజ్... రెడ్ బాల్ క్రికెట్‌లోనూ మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు..
‘ఐపీఎల్‌లో హైదరాబాద్‌లో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్‌సీబీ టీమ్ మేట్స్ అందరినీ నేను ఇంటికి డిన్నర్‌కి పిలిచాను...
నేను హోటల్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయాను. విరాట్‌కి ఫోన్ చేస్తే... ‘నేను రాలేను మియ్యా... బాగా అలసిపోయా...’ అంటూ పెట్టేశాను...
నేనేం చెప్పలేక ఫోన్ పెట్టేశాను. అందరూ ఇంటికి రాగానే, కారులో చూస్తే విరాట్ కోహ్లీ... అతనితో పాటు పీపీ (పార్థివ్ పటేల్) భాయ్, చాహాల్ భాయ్ కూడా ఉన్నారు...
నేను ఆనందం తట్టుకోలేక విరాట్ భయ్యా దగ్గరికి వెళ్లి, హగ్ చేసుకున్నా. అదే నా జీవితంలో బెస్ట్ సర్‌ప్రైజ్...
ఎందుకంటే రానని చెప్పిన విరాట్ కోహ్లీ, నా ఇంటికి రావడం. టోలిచౌకికి విరాట్ కోహ్లీ రావడం పెద్ద న్యూస్ అయిపోయింది...’ అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ సిరాజ్...
‘నా చిన్నతనంలో ఎన్నో ఆర్థిక కష్టాలు అనుభవించాను... మా నాన్న ఆటో నడిపేవారు. నాకు ఓ ప్లాటినా బండి ఉండేది...
నాన్న నాకు పెట్రోల్ కోసం రోజూ రూ.60 ఇచ్చేవాడు. ఆ డబ్బులతో టోలిచౌకీ నుంచి ఉప్పల్ స్టేడియం దాకా వచ్చేవాడిని...
ఐపీఎల్‌కి ఎంపికైన తర్వాత ఈ కష్టాలన్నీ మాయమైపోయాయి. నాన్న ఆటో నడిపేయడం మానేశాడు. అమ్మ ఇళ్లల్లో పనులు చేయడం మానేసింది...
అద్దె ఇంట్లో ఉండడం మానేశాం. కొత్త ఇల్లు కొనుక్కున్నాం. నా జీవితంలో ఇంకేం అవసరం లేదు. మా అమ్మానాన్నలను సంతోషంగా చూడగలిగాను...
ఐపీఎల్ నాకు ఫేమ్ ఇచ్చింది. సిరాజ్ అనే ప్లేయర్ ఉన్నాడని ప్రపంచానికి పరిచయం చేసింది...’ అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ సిరాజ్...