MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ పుట్టినప్పుడే టెండూల్కర్ రికార్డులు కొడతాడని డిసైడ్ అయ్యిందా... ఇద్దరి మధ్య పోలికలు చూస్తే...

విరాట్ పుట్టినప్పుడే టెండూల్కర్ రికార్డులు కొడతాడని డిసైడ్ అయ్యిందా... ఇద్దరి మధ్య పోలికలు చూస్తే...

డెస్టినీపై చాలామందికి నమ్మకం ఉండదు. అయితే మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్‌కీ, విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న పోలికలు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు...

3 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 05 2022, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

డెస్టినీ... చాలామందికి దీనిపై నమ్మకం ఉండదు. అయితే మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్‌కీ, విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న పోలికలు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214

1988, నవంబర్ 5న జన్మించాడు విరాట్ కోహ్లీ. సరిగ్గా ఇదే రోజున సచిన్ టెండూల్కర్‌కి 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ జట్టులోకి పిలుపు దక్కింది. 1989లో (విరాట్ కోహ్లీ మొదటి పుట్టినరోజు) పాకిస్తాన్‌ టూర్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న టెండూల్కర్, 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలాడు...

314

2008లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, కొద్దిరోజుల్లోనే సచిన్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న రికార్డులు బద్ధలుకొట్టడం ఎవ్వరివల్లైనా అవుతుందంటే... అది ఒక్క విరాట్ కోహ్లీయే. 

414

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన రోజు 18. సచిన్ టెండూల్కర్ డిసెంబర్ 18, 1989న పాకిస్థాన్‌పై క్రికెట్ ఆరంగ్రేటం చేస్తే... విరాట్ కోహ్లీ 18, ఆగస్టు 2008న శ్రీలంకపై ఆరంగ్రేటం చేశాడు.

514

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా తమ 14వ టెస్టు ఇన్నింగ్స్‌లోనే తొలి టెస్టు సెంచరీ నమోదుచేశారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ వరల్డ్ కప్‌లో తమ మొదటి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును పాకిస్థాన్‌పైనే సాధించారు.

614

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన కెప్టెన్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీయే. సచిన్ టెండూల్కర్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి మొదటి టెస్టు సెంచరీ సాధిస్తే, విరాట్ కోహ్లీ కూడా ఆరోస్థానంలో మొట్టమొదటి శతకాన్ని నమోదుచేశాడు.

714

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కెప్టెన్లుగా వన్డేల్లో మొదటి మ్యాచ్‌ శ్రీలంకపై ఆడితే... టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఆడారు.సచిన్ టెండూల్కర్ నవంబర్ 26న టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధిస్తే, విరాట్ కోహ్లీ కూడా నవంబర్ 26నే టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదాడు...

814

సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో తన నాలుగో డబుల్ సెంచరీ బంగ్లాదేశ్‌పై, ఐదో డబుల్ సెంచరీ శ్రీలంకపై చేశారు. విరాట్ కోహ్లీ కూడా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ చేశాడు.సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్‌లో 58వ సెంచరీ ఇంగ్లాండ్‌పై సాధించాడు. విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్‌పై తన 58వ శతకం బాదాడు. ఇందులో మరీ విచిత్రం ఏంటంటే... ఇద్దరూ కూడా 197 బంతుల్లో 103 పరుగులు చేశారు. ఆడిన బంతులు, చేసిన పరుగులు కూడా సేమ్ టు సేమ్.

914

సచిన్ టెండూల్కర్ తన ఆరో టెస్టు సెంచరీ ఆస్ట్రేలియాలో సాధించగా... కింగ్ కోహ్లీ కూడా ఆసీస్ గడ్డపైనే ఆరో శతకం బాదాడు.సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 3 వేల పరుగుల మైలురాయిని శ్రీలంకపై అందుకున్నారు. విరాట్ కోహ్లీ కూడా శ్రీలంకపైనే ఈ ఫీట్ సాధించాడు.

1014

సచిన్ టెండూల్కర్ వాంఖడే స్టేడియంలో 4000 టెస్టు పరుగుల మైలురాయి అందుకుంటే, విరాట్ కోహ్లీ కూడా ఇదే మైదానంలో ఈ ఫీట్ అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా తమ మొట్టమొదటి వన్డే హాఫ్ సెంచరీని శ్రీలంకపై నమోదుచేశారు.
 

1114
Virat Kohli

Virat Kohli

వన్డేల్లో సచిన్ టెండూల్కర్ సెంచరీతో 10 వేల మైలురాయిని అందుకుంటే, విరాట్ కోహ్లీ కూడా 10 వేల మైలురాయి అందుకున్న మ్యాచ్‌లో సెంచరీ చేశాడు.సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా తమ 60వ అంతర్జాతీయ సెంచరీని వెస్టిండీస్‌పైనే నమోదుచేశారు.

1214

న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీలు బాదిన భారత కెప్టెన్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాత్రమే. మిగిలిన కెప్టెన్లు ఎవ్వరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు.సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా ఐపీఎల్‌లో తమ మొట్టమొదటి సెంచరీనీ ఆఖరి బంతికి అందుకున్నారు. ఇద్దరూ చేసిన మొదటి సెంచరీ స్కోరు 100 నాటౌట్.

1314
sachin kohli

sachin kohli

ఆస్ట్రేలియపై 1000 టెస్టు పరుగులు అందుకున్న సమయంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీకి ఒకే వయసు, మ్యాచ్ జరిగిన ప్రదేశం కూడా ఒకటే.ఇంగ్లాండ్‌పై సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ డిసెంబర్ 15న సెంచరీ చేశారు. ఇద్దరూ కూడా 103 పరుగుల వద్ద అవుట్ అయ్యారు.

1414

సచిన్ టెండూల్కర్ చేసిన మొదటి 50 సెంచరీల్లో 22 సెంచరీలు ఆస్ట్రేలియా, శ్రీలంకపైనే వచ్చాయి. విరాట్ కోహ్లీ కూడా సేమ్ టు సేమ్ సీన్ కాపీ చేశాడు.సచిన్ టెండూల్కర్ ఐపీఎల్‌లో 2 వేల పరుగులను రాజస్థాన్ రాయల్స్‌పై జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో అందుకుంటే, విరాట్ కూడా రాజస్థాన్‌పై జైపూర్‌లోనే 2 వేల ఐపీఎల్ పరుగులను చేరుకున్నాడు.
 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved