MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • KKR vs GT: 22 సిక్సర్లు, 12 ఫోర్లతో ఊరమాస్ బ్యాటింగ్.. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ విధ్వంసంతో జీటీకి బిగ్ షాక్ !

KKR vs GT: 22 సిక్సర్లు, 12 ఫోర్లతో ఊరమాస్ బ్యాటింగ్.. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ విధ్వంసంతో జీటీకి బిగ్ షాక్ !

KKR vs GT: ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ప్లేయర్లు ఊరమాస్ బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. పరుగుల వరద పారిస్తూ స్టేడియాన్ని హోరెత్తించారు. గుజరాత్‌ టైటాన్స్‌పై 29 పరుగుల తేడాతో గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 17 2026, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గిల్ టీమ్ జైత్రయాత్రకు బ్రేక్.. ప్లేఆఫ్ రేసులోకి కేకేఆర్
Image Credit : X@IPL

గిల్ టీమ్ జైత్రయాత్రకు బ్రేక్.. ప్లేఆఫ్ రేసులోకి కేకేఆర్

ఐపీఎల్ 2026 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన 60వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై కేకేఆర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌పై ఉన్న తేమను వాడుకుని కేకేఆర్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయాలనేది గుజరాత్ ప్లాన్.

కానీ, కోల్‌కతా ఓపెనర్లు క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే గుజరాత్ బౌలర్లపై అటాక్ స్టార్ట్ చేశారు. గ్రౌండ్ లో అన్నివైపులా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్‌కు ఇది మూడవ అత్యధిక స్కోరు కావడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫిన్ అలెన్ రచ్చ రంభోలా.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
Image Credit : ANI

ఫిన్ అలెన్ రచ్చ రంభోలా.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ క్రీజులో ఉన్నంతసేపు స్టేడియంలో అభిమానులకు పూనకాలు వచ్చాయి. ఇన్నింగ్స్ మొదట్లో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడా వేసిన ఓవర్లలో కేకేఆర్ నెమ్మదిగానే స్టార్ట్ చేసింది. మొదటి 2 ఓవర్లలో 13 పరుగులే చేసినా, ఆ తర్వాత అలెన్ గేర్ మార్చాడు. రబాడా వేసిన నాలుగో ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాది టెంపో సెట్ చేశాడు.

అజింక్యా రహానే (14) రూపంలో సిరాజ్ టీ20ల్లో తన 200వ వికెట్ పడగొట్టినా, అలెన్ అస్సలు తగ్గలేదు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును దాటేశాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న అలెన్ 4 ఫోర్లు, 10 భారీ సిక్సర్ల సాయంతో 93 పరుగులు సాధించాడు. 273.53 స్ట్రైక్ రేట్‌తో గుజరాత్ బౌలింగ్ లైనప్‌ను ముక్కలు చేశాడు. అర్షద్ ఖాన్ వేసిన 11వ ఓవర్లో 6, 6, 6, 4 బాది ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. అలెన్ విధ్వంసంతో కేకేఆర్ 11 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 138 పరుగులు చేసి భారీ స్కోరుతో గట్టి పునాది వేసింది.

Related Articles

Related image1
Tilak Varma: అవమానించిన చోటే గెలిచాడు.. ఇది కదా తెలుగోడి రివేంజ్ అంటే! అర్ష్‌దీప్‌ను చితక్కొట్టిన తిలక్ వర్మ!
Related image2
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ దెబ్బ.. పంత్, అక్షర్, రహానేలకు దిమ్మతిరిగే షాక్ !
35
రఘువంశీ, కెమెరాన్ గ్రీన్ నెవర్ ఎండింగ్ షో
Image Credit : ANI

రఘువంశీ, కెమెరాన్ గ్రీన్ నెవర్ ఎండింగ్ షో

ఫిన్ అలెన్ అవుట్ అయిన తర్వాత కూడా కోల్‌కతా రన్ రేట్ ఎక్కడా తగ్గలేదు. యంగ్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ, ఆల్‌రౌండర్ కెమెరాన్ గ్రీన్ గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. 44 బంతులు ఎదుర్కొన్న రఘువంశీ 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో రఘువంశీకి ఇది ఐదో హాఫ్ సెంచరీ.

అతనికి తోడుగా వచ్చిన కెమెరాన్ గ్రీన్ కూడా గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ వేసిన 19వ ఓవర్లో రఘువంశీ 6, 2, 6, 6, 4 బాది 24 పరుగులు రాబట్టాడు. వీరిద్దరి ఊరమాస్ పార్ట్‌నర్‌షిప్ ధాటికి కేకేఆర్ రన్ రేట్ 12.35 కు చేరింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 50 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 57 పరుగులు సమర్పించుకున్నాడు.

45
చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు డ్రాప్.. గుజరాత్ పై దెబ్బ
Image Credit : ANI

చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు డ్రాప్.. గుజరాత్ పై దెబ్బ

గుజరాత్ టైటాన్స్ ను వారి చెత్త ఫీల్డింగ్ దెబ్బకొట్టింది. కేకేఆర్ బ్యాటర్లు ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను గుజరాత్ ఫీల్డర్లు వదిలేశారు. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ 33 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ని బౌండరీ లైన్ దగ్గర మహ్మద్ సిరాజ్ డ్రాప్ చేశాడు. ఆ తర్వాత అలెన్ విధ్వంసం ఆగలేదు. 

అలాగే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో కెమెరాన్ గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌ని అర్షద్ ఖాన్ వదిలేయగా, కగిసో రబాడా బౌలింగ్‌లో అంగ్‌క్రిష్ రఘువంశీ ఇచ్చిన క్యాచ్‌ని వాషింగ్టన్ సుందర్ మిస్ చేశాడు. ఇలా లైఫ్‌లు పొందిన కేకేఆర్ బ్యాటర్లు గుజరాత్ బౌలర్లను బౌండరీల అవతలకు పంపించారు.

55
పోరాడి ఓడిన గుజరాత్.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు
Image Credit : ANI

పోరాడి ఓడిన గుజరాత్.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు

248 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ సైతం గట్టిగానే పోరాడింది. గుజరాత్ టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్లు హాఫ్ సెంచరీలు బాదారు. ఓపెనర్లు సాయి సుదర్శన్, జోస్ బట్లర్‌తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో కేకేఆర్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. అయినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 218 పరుగులకే పరిమితమైంది.

చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు డెత్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేసి జట్టుకు 29 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందించారు. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకెళ్లాలని చూసిన గిల్ సేనకు కేకేఆర్ గట్టి షాక్ ఇచ్చింది. గత 6 మ్యాచ్ లలో కేకేఆర్ 5 విజయాలు అందుకుని తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం జీటీ 2, కేకేఆర్ 7వ స్థానంలో ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
Tilak Varma: అవమానించిన చోటే గెలిచాడు.. ఇది కదా తెలుగోడి రివేంజ్ అంటే! అర్ష్‌దీప్‌ను చితక్కొట్టిన తిలక్ వర్మ!
Recommended image2
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ దెబ్బ.. పంత్, అక్షర్, రహానేలకు దిమ్మతిరిగే షాక్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved