విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ఎంత ప్రత్యేకమో తెలుసా? అందుకే ఒక్క లీటర్ అంత ఖరీదు
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. అతడి ఫిట్ నెస్ కు తాగే బ్లాక్ వాటర్ కారణం. ఈ బ్లాక్ వాటర్ వల్ల లాభాలేంటి? ఎంత ఖరీదో తెలుసుకోండి.

Virat Kohli
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాళ్లలో ఒకడు. కోహ్లీ బ్యాటింగ్, ఫిట్‌నెస్, క్రమశిక్షణలో బెంచ్‌మార్క్‌లు సెట్ చేశాడు. చాలా మందికి స్ఫూర్తినిచ్చాడు. ఈ ఆటగాడు తన దూకుడు బ్యాటింగ్‌కు, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి బాగా ప్రయత్నిస్తాడు.
2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా తరపున ఆరంగేట్రం చేశాడు విరాట్ కోహ్లీ. కొద్ది రోజుల్లోనే అన్ని ఫార్మాట్‌లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 36 ఏళ్ల ఈ ఆటగాడు 549 మ్యాచ్‌లలో 52.36 సగటుతో 27598 పరుగులు చేశాడు. ఇందులో 82 సెంచరీలు, 143 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 14000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. ఈ ఫార్మాట్‌లో వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా నిలిచాడు (287 ఇన్నింగ్స్‌లు).
విరాట్ కోహ్లీ తన విజయాలు, రికార్డులతో పాటు ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తన డైట్‌ను క్రమం తప్పకుండా పాటిస్తాడు. అతను హైడ్రేటెడ్‌గా ఉండటానికి తాగే బ్లాక్ వాటర్ చాలా ప్రత్యేకమైంది.
Virat Kohli
విరాట్ కోహ్లీ తరచుగా బ్లాక్ వాటర్ తాగుతూ కనిపిస్తాడు. దీని గురించి అభిమానులు ఎందుకు తాగుతాడని ఆశ్చర్యపోతుంటారు. బ్లాక్ వాటర్‌ను ఆల్కలీన్ వాటర్ అని కూడా అంటారు. ఇందులో ఫుల్విక్ యాసిడ్, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి, pH స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.
Virat Kohli
విరాట్ కోహ్లీ సాధారణ నీటి కంటే బ్లాక్ వాటర్‌ను ఎంచుకోవడానికి కారణం తన ఫిట్‌నెస్. ఇది వేగంగా కోలుకోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి సహాయపడుతుంది. ఆల్కలీన్ వాటర్ లేదా బ్లాక్ వాటర్ pH స్థాయిని పెంచుతుంది. కండరాల పునరుద్ధరణకు, ఆమ్లతను తగ్గించడానికి, పోషకాలను అందించడానికి సహాయపడుతుంది.
బ్లాక్ వాటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే చాలా మంది అథ్లెట్లు, విరాట్ కోహ్లీ దీనిని తమ జీవితంలో భాగం చేసుకున్నారు. కోహ్లీ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి మైదానం వెలుపల వ్యాయామాలు చేస్తాడు. బ్లాక్ వాటర్ తాగడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటానికి, కండరాలు కోలుకోవడానికి సహాయపడుతుంది.
Virat Kohli
భారతదేశంలో బ్లాక్ వాటర్ అందుబాటులో ఉంది. కానీ సాధారణ నీటి కంటే కొంచెం ఖరీదైనది. 1 లీటరు బ్లాక్ వాటర్ ధర బ్రాండ్‌ను బట్టి రూ. 100 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. అయితే కోహ్లీ ప్రత్యేకమైన బ్లాక్ వాటర్ బ్రాండ్‌ను ఉపయోగిస్తాడు. దీని ధర లీటరుకు రూ. 4000. ఇది అథ్లెట్లు, ఫిట్‌నెస్ చేసేవారికి చాలా ఖరీదైన ఎంపిక.
కోహ్లీ ఎవియన్ బ్లాక్ వాటర్ తాగుతాడు. ఇది యూరప్‌లోని అతిపెద్ద సరస్సులలో ఒకదాని నుండి వచ్చే ఆల్కలీన్ వాటర్ బ్రాండ్. ఇది సహజమైన, పూర్తి శుద్దీకరణ ప్రక్రియ ద్వారా తయారవుతుంది. ఖనిజాలు, అధిక pH స్థాయిలను కలిగి ఉంటుంది.
Virat Kohli
విరాట్ కోహ్లీ తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పటికీ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి గత కొన్నేళ్లుగా బ్లాక్ వాటర్ తాగుతున్నాడు. ఇది ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతని ప్రదర్శనలో స్పష్టంగా కనిపిస్తుంది. బ్లాక్ వాటర్ ఎక్కువసేపు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మైదానంలో ఎక్కువ శక్తితో ఉండటానికి సహాయపడుతుంది.
Virat Kohli
విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. 36 ఏళ్ల ఈ ఆటగాడు ప్రస్తుతం టోర్నమెంట్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌లలో 72.33 సగటుతో సెంచరీ, హాఫ్ సెంచరీతో సహా 217 పరుగులు చేశాడు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగులు చేసి శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టాడు. టోర్నమెంట్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 17 మ్యాచ్‌లలో 82.88 సగటుతో సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలతో సహా 746 పరుగులు చేశాడు.