సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ గొప్ప వన్డే బ్యాటర్! ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా కామెంట్స్..
ప్రస్తుత తరంలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. 25 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన విరాట్, 77 అంతర్జాతీయ సెంచరీలతో సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు...
Sachin Tendulkar - Virat Kohli
ప్రస్తుత తరంలో కొంతమంది ఫ్యాన్స్ విరాట్ కోహ్లీతో స్టీవ్ స్మిత్, రోహిత్ శర్మ, జో రూట్, బాబర్ ఆజమ్ లాంటి ప్లేయర్లను పోల్చి చూస్తుంటారు. అయితే మాజీ క్రికెటర్లు మాత్రం విరాట్‌ని, సచిన్ టెండూల్కర్‌తో పోల్చి చూస్తారు...
సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన 100 సెంచరీల రికార్డే లక్ష్యంగా దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ, వన్డేల్లో మాత్రం మాస్టర్ రికార్డులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇప్పటికే వన్డేల్లో 47 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, మరో 2 సెంచరీలు చేస్తే సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును అందుకుంటాడు. 3 సెంచరీలు చేస్తే, వన్డే ఫార్మాట్‌లో 50 సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేస్తాడు..
‘నా ఉద్దేశంలో వన్డేల్లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ కంటే బెస్ట్ బ్యాటర్. అతని గణాంకాలు చూస్తే, ఈ విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును దాదాపు అందుకున్నాడు..
సచిన్ ఆడిన మ్యాచుల కంటే విరాట్ కోహ్లీ ఆడిన వన్డేల సంఖ్య చాలా చాలా తక్కువ. నా చిన్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఓ బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేశాడు. దాన్ని ఎవ్వరూ అందుకోలేకపోయారు, ఒక్క విరాట్ తప్ప..
ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా తనకంటూ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు. వన్డేల్లో గ్రేటర్ రన్ ఛేజర్. అతని నిలకడైన ప్రదర్శన చూస్తే ముచ్ఛటేస్తుంది. ఇంత సుదీర్ఘకాలం నిలకడైన ప్రదర్శన ఇవ్వడం మామూలు విషయం కాదు..
అతను తీసే డబుల్స్, కొట్టే ఫోర్లు చూడచక్కగా ఉంటాయి. అతను వన్డేల్లో ఎక్కువ సిక్సర్లు కొట్టలేదు. కొట్టాల్సిన అవసరం కూడా లేదు. తన చుట్టూ ఉన్న ప్లేయర్లను కూడా విరాట్ కోహ్లీ తన ఆటతో ప్రభావితం చేస్తాడు..
sachin kohli
నాకు తెలిసి అందరూ విరాట్‌తో కలిసి ఆడేందుకు ఇష్టపడతారు. చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉండాలని సంకల్పించుకుని టీమ్‌లోకి వచ్చాడు. అదే చేస్తున్నాడు.. ఇది తరానికి ఒక్కరికే సాధ్యం అవుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా..