అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు..
Ram Mandir - Virat Kohli: అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠకు ముందు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మలకు కూడా ఆహ్వానం అందింది.
Ayodhya Ram Mandir Pran Pratishtha: జనవరి 22న రామ మందిరాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రముఖులను ఆహ్వానించారు. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు కూడా ఆహ్వానం అందింది.
అఫ్గానిస్థాన్ తో టీ20 సిరీస్ తో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ తన బిజీ షెడ్యూల్ మధ్య రామ మందిర ఆహ్వానాన్ని అంగీకరించాడు. విరాట్-అనుష్క దంపతులకు ఆహ్వానం అందిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో విజయం సాధించిన టీమిండియా మూడో టీ20 కోసం నేరుగా బెంగళూరుకు బయలుదేరింది. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ముంబై వెళ్లాడు.
Virat Kohli Anushka Sharma In Rishikesh Ashram
అయోధ్యలో రామ మందిరానికి సంబంధించిన ఆహ్వానాన్ని స్వీకరించడానికి విరాట్ కోహ్లీ ఇండోర్ నుండి ముంబైకి తిరిగి వచ్చాడని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందుకునేందుకు కోహ్లీ ముంబైకి తిరిగి వచ్చాడు.
ముంబైలోని తమ నివాసంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు రామ మందిరానికి ఆహ్వానం అందింది. ముంబై నుంచి కోహ్లీ నేరుగా బెంగళూరుకు పయనమవుతాడనీ, ఆఫ్ఘానిస్తాన్ తో జరిగే మూడో టీ20లో పాల్గొంటాడని టీమిండియా వర్గాలు తెలిపాయి.
కోహ్లీ-అనుష్క దంపతులకు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ దంపతులకు కూడా రామ మందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించారు. రాంచీలోని తన నివాసంలో ధోనీ ఈ ఆహ్వానాన్ని స్వీకరించాడు.
క్రికెటర్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఆయన కుటుంబ సభ్యులను కూడా రామ మందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించారు. జనవరి 22న సచిన్ తన కుటుంబంతో కలిసి అయోధ్యకు వెళ్లనున్నారు.
Venkatesh Prasad
కర్ణాటకకు చెందిన మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా రామ మందిర ప్రతిష్ఠాపన ఆహ్వానాన్ని అందుకున్నాడురు. ఈ నెల 22న అయోధ్యకు వెళ్తానని వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు.