- Home
- Sports
- Cricket
- విరుష్క జోడీ బాడీగార్డుకి ఇచ్చే శాలరీతో అడివి శేషు ఓ సినిమా తీసేయొచ్చు... ఎంతిస్తున్నారో తెలుసా...
విరుష్క జోడీ బాడీగార్డుకి ఇచ్చే శాలరీతో అడివి శేషు ఓ సినిమా తీసేయొచ్చు... ఎంతిస్తున్నారో తెలుసా...
భారత్‌లో మోస్ట్ పాపులర్ కపుల్ అంటే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటే. విరుష్కగా పిలవబడే ఈ జోడీకి సోషల్ మీడియాలో 200 మిలియన్లకు పైగా ఫాలోయిగ్ ఉంది. బయట విరాట్‌కి ఉండే క్రేజ్‌ని లెక్కబెట్టేందుకు ఏ లెక్కలు సరిపోవు...

అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ ఏటా దాదాపు రూ.130 కోట్ల ఆదాయాన్ని యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నాడు.. అనుష్క శర్మ కూడా ఒక్కో సినిమాకి రూ.10 కోట్ల దాకా పారితోషికం తీసుకుంటోంది...
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టుకి రూ.4 కోట్ల దాకా అందుకునే విరాట్ కోహ్లీ, బీసీసీఐ మ్యాచ్ ఫీజు, కాంట్రాక్ట్, ఐపీఎల్ ద్వారా సుమారు రూ.70 నుంచి రూ.75 కోట్ల ఆదాయం పొందుతున్నాడు...
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ వార్షిక ఆదాయం కలిపితే దాదాపు రూ.వెయ్యి కోట్ల దాకా ఉంటుందని అంచనా. అయినా విరుష్క ఇంట్లో పనివాళ్లు ఉండరట...
కూతురు పుట్టుక ముందు వరకూ ఇంట్లో పనులన్నీ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలే స్వయంగా చేసుకునేవారు. కూతురు వామిక పుట్టిన తర్వాత ఆమె ఆలనాపాలనా చూసుకునేందుకు తగినంత సమయం కేటాయించేందుకు పనివాళ్లను కూడా పెట్టుకున్నారు..
కూతురు పుట్టిన తర్వాత విరాట్ కోహ్లీతో పాటు ఐపీఎల్, ఆస్ట్రేలియా టూర్, ఇంగ్లాండ్ టూర్‌లకు కలిసి వెళ్లింది అనుష్క శర్మ. యూఏఈలో నిండు గర్భంతో కనిపించిన అనుష్క, ఇంగ్లాండ్ టూర్‌లో కూతురు వామికను ఎత్తుకుని ముందు నడుస్తుంటే... విరాట్ కోహ్లీ వెనక బ్యాగులు మోస్తూ కనిపించాడు...
అందరు సెలబ్రిటీలల్లాగే విరుష్క జోడి కూడా ఓ పర్సనల్ బాడీ గార్డును మెయింటైన్ చేస్తోంది. అతని పేరు ప్రకాశ్ సింగ్ అలియాస్ సోను...
పెళ్లికి ముందు అనుష్క శర్మకు బాడీగార్డుకి వ్యవహరించిన ప్రకాశ్ సింగ్ సోను, ఇప్పుడు విరాట్ కోహ్లీకి కూడా సంరక్షకుడిగా ఉన్నాడు....
ప్రకాశ్ సింగ్ సోనుకి అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జోడీ ఏటా 1.20 కోట్ల రూపాయలను వేతనంగా చెల్లిస్తోంది... అంటే నెలకు 10 లక్షల రూపాయలు...
దాదాపు కోటిన్నర రూపాయల శాలరీ.. ఇదే మొత్తం బడ్జెట్‌గా ఇస్తే అడివి శేషు సింపుల్‌గా ఓ బ్లాక్ బస్టర్ మూవీని తీసేస్తాడు. ఓ సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం దాదాపు పదేళ్లు కూర్చొని తినొచ్చు...
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌లానే అనుష్క శర్మ కూడా ప్రకాశ్ సింగ్ సోనుని సొంత కుటుంబసభ్యుడిగానే ట్రీట్ చేస్తుందట. సోనూని ‘భయ్యా’ అంటూ ముద్దుగా పిలుస్తుందట అనుష్క...
అంతేకాదు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో నటించిన ‘జీరో’ మూవీ షూటింగ్‌లో సోనూ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా జరిపించింది అనుష్క శర్మ...
అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ సమయంలో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్‌లో ఉండడంతో ఆమె కేరింగ్ మొత్తం సోనూయే చూసుకున్నాడట. ఇప్పుడు వామిక కోహ్లీ రక్షణ బాధ్యతలు కూడా సోనూకే అప్పగించారట...
అంతా బాగానే ఉన్నా అమితాబ్ బచ్చన్ బాడీగార్డు జితేంద్ర షిండే శాలరీ డిటైల్స్ బయటికి రాగానే ఐటీ అధికారులు అతని ఇంటిపై దాడి చేసినట్టు, సోనూ కూడా తన శాలరీ వివరాలు బయటికి రావడంతో కాస్త భయపడుతున్నాడట.