MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • కోహ్లీని పెళ్లి చేసుకునేందుకు అనుష్క శర్మ పెట్టిన కండీషన్ అదేనట... ఆ ఒక్కదానికీ ఒప్పుకుంటే...

కోహ్లీని పెళ్లి చేసుకునేందుకు అనుష్క శర్మ పెట్టిన కండీషన్ అదేనట... ఆ ఒక్కదానికీ ఒప్పుకుంటే...

టీ20 కెప్టెన్సీని వదులుకుని, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించబడి, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు విరాట్ కోహ్లీ... ప్రపంచంలోనే 160 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగిన మొట్టమొదటి క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పెళ్లి రోజు నేడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 11 2021, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత విరాట్ కోహ్లీని ఎందుకు పెళ్లాడాలిందో సీక్రెట్ బయటపెట్టింది అనుష్క శర్మ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

2017, డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలకు అప్పుడు సరిగ్గా 29 ఏళ్లు. నిజానికి విరాట్ కోహ్లీ కంటే అనుష్క శర్మ ఆరు నెలలు పెద్ద కూడా. అనుష్క శర్మ 1988, మే 1న జన్మిస్తే, విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న జన్మించాడు...

310

ఇటలీలో అత్యంత ఘనంగా జరిగిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పెళ్లికి అతికొద్ది బంధుమిత్రులు, ఆప్తులు మాత్రమే హాజరయ్యారు. అయితే 29 ఏళ్ల వయసులో పెళ్లికి అంగీకరించేముందు కోహ్లీకి ఓ కండీషన్ పెట్టిందట అనుష్క శర్మ...

410

‘29 ఏళ్లకే పెళ్లి అంటే, చాలా చిన్న వయసులో పెద్ద నిర్ణయం తీసుకుంటున్నట్టు అనిపించింది. ముఖ్యంగా హీరోయిన్‌కి పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. హీరోయిన్‌గా మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం కూడా రిస్కే...

510

ప్రేక్షకులు, హీరో హీరోయిన్లను ఎప్పుడూ తెరపై యంగ్‌గా చూడాలని అనుకుంటారు. అంతేకాకుండా పెళ్లి కాగానే పిల్లల్ని కనాలి, తల్లిగా బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచన నుంచి అందరూ బయటికి రావాలి.

610

విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకుందామని అడగ్గానే, నేను ఒక కండీషన్ పెట్టాను. నాకు, నా వ్యక్తిగత జీవితానికి గౌరవం ఉండాలి... అని! దానికి విరాట్ ఎప్పుడూ అడ్డు చెప్పడని తెలుసు... ’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క శర్మ..

710

పెళ్లికి ముందు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. పెళ్లైన తర్వాత బిజీ షెడ్యూల్ కారణంగా మొదటి ఏడాది కేవలం 22 రోజులు మాత్రమే కలిసి ఉన్నామని ప్రకటించింది విరుష్క జోడి...

810

కరోనా కారణంగా క్రికెట్‌కి, సినిమాలకు బ్రేక్ పడడంతో ఈ ఇద్దరూ కలిసి గడపడానికి కావాల్సినంత సమయం దక్కింది. లాక్‌డౌన్‌లో గర్భం దాల్చిన అనుష్క శర్మ, 2021, జనవరి 11న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే..

910

తమ కూతురికి వామిక అని నామకరణం చేశారు విరాట్, అనుష్క. సోషల్ మీడియాకి దూరంగా కూతురిని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు విరుష్క జోడీ...

1010

క్రికెట్ ఫీల్డ్‌లో అగ్రెసివ్‌గా పేరు తెచ్చుకున్నా, ఇంట్లో మాత్రం విరాట్ కోహ్లీ చాలా సైలెంట్ అంట. అనుష్క శర్మయే ఎప్పుడూ విరాట్ కోహ్లీపైన అరుస్తూ ఉంటుందట. విరాట్, భార్య కోపాన్ని భరిస్తూ, తన తప్పు లేకపోయినా ప్రేమగా దగ్గరికి తీసుకుని సారీ కూడా చెబుతాడట...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved