MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • ‎Catch of IPL 2026: మనీష్ పాండే సూపర్ మ్యాన్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో!

‎Catch of IPL 2026: మనీష్ పాండే సూపర్ మ్యాన్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో!

‎Catch of IPL 2026: ఐపీఎల్ 2026లో మనీష్ పాండే అద్భుత క్యాచ్‌తో విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్ షాక్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై ఘనవిజయం సాధించింది. పాండే అందుకున్న ఈ సూపర్ క్యాచ్ ఈ సీజన్ లోనే బెస్ట్ అని చెప్పాలి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 14 2026, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
‎Manish Pandey: బిత్తరపోయిన బ్యాటర్.. ఐపీఎల్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ క్యాచ్!
Image Credit : ANI

‎Manish Pandey: బిత్తరపోయిన బ్యాటర్.. ఐపీఎల్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ క్యాచ్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. కేకేఆర్ సీనియర్ ప్లేయర్ మనీష్ పాండే పట్టిన ఒక కళ్లు చెదిరే క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ క్యాచ్ చూసి అటు బ్యాటర్ టిమ్ డేవిడ్, ఇటు నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చివరకు మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించినప్పటికీ, పాండే ఫీల్డింగ్ మాత్రం హైలైట్‌గా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
‎నమ్మశక్యం కాని రీతిలో ఒంటిచేత్తో క్యాచ్
Image Credit : X/StarSportsIndia

‎నమ్మశక్యం కాని రీతిలో ఒంటిచేత్తో క్యాచ్

‎బెంగళూరు ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. కార్తీక్ త్యాగి వేసిన బంతిని టిమ్ డేవిడ్ పాయింట్ దిశగా బలంగా బాదాడు. ఆ బంతి మెరుపు వేగంతో వెళ్తుండగా, బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న మనీష్ పాండే తన ఎడమ వైపునకు అద్భుతంగా డైవ్ చేశాడు. గాలిలో తేలుతూ, నేలకు కొద్ది అంగుళాల దూరంలోనే ఒంటిచేత్తో ఆ బంతిని ఒడిసిపట్టాడు.

బంతి వేగాన్ని బట్టి చూస్తే అది ఫోర్ వెళ్లడం ఖాయమని అందరూ భావించారు. కానీ పాండే తన ఎడమ చేయితో ఆ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కామెంటేటర్ గ్రేమ్ స్వాన్ దీనిని "ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్" అని అభివర్ణించారు.

34
‎మైదానంలో అయోమయం.. థర్డ్ అంపైర్ నిర్ణయం
Image Credit : X/StarSportsIndia

‎మైదానంలో అయోమయం.. థర్డ్ అంపైర్ నిర్ణయం

‎పాండే ఆ క్యాచ్‌ను పట్టిన తీరు చూసి అంపైర్లు సైతం షాక్ అయ్యారు. బంతి నేలకు తగిలిందేమోనన్న అనుమానంతో నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రీప్లేలో పాండే వేళ్లు బంతి కింద స్పష్టంగా ఉన్నాయని, క్యాచ్ క్లీన్‌గా పట్టినట్లు తేలడంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించారు.

ఈ సమయంలో విరాట్ కోహ్లీ బిగ్ స్క్రీన్‌పై రీప్లే చూస్తూ నోరెళ్లబెట్టాడు. బౌలర్ కార్తీక్ త్యాగి తన తలపై చేతులు పెట్టుకుని నమ్మలేనట్లుగా ఉండిపోయాడు. విరాట్ కోహ్లీ క్రీజులో పాండే వద్దకు వెళ్లి ఆ క్యాచ్‌ను అభినందించాడు.

𝙄𝙨 𝙞𝙩 𝙖 𝙗𝙞𝙧𝙙? 𝙄𝙨 𝙞𝙩 𝙖 𝙥𝙡𝙖𝙣𝙚? 𝙄𝙩'𝙨 𝙈𝙖𝙣𝙞𝙨𝙝 𝙋𝙖𝙣𝙙𝙚𝙮 ✈️#ManishPandey catches a blinder to dismiss #TimDavid 🤯#TATAIPL Race To Playoffs 2026 ➡️ #RCBvKKR | LIVE NOW 👉https://t.co/9SHVzm41aO pic.twitter.com/uwWo8hx3Vm

— Star Sports (@StarSportsIndia) May 13, 2026

44
‎విరాట్ కోహ్లీ వీరవిహారం.. ఆర్‌సీబీ టాప్
Image Credit : ANI

‎విరాట్ కోహ్లీ వీరవిహారం.. ఆర్‌సీబీ టాప్

‎మనీష్ పాండే క్యాచ్ కేకేఆర్ శిబిరంలో ఉత్సాహం నింపినప్పటికీ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ముందు అది సరిపోలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన కోహ్లీ, ఈ మ్యాచ్‌లో 60 బంతుల్లో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీ ధాటికి ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ఈ విజయంతో రజత్ పటీదార్ నేతృత్వంలోని బెంగళూరు పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరుకోవడమే కాకుండా, ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. టీ20 క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన వేగవంతమైన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
RCB vs KKR: కోహ్లీ విశ్వరూపం.. 10వ సెంచరీతో కేకేఆర్ పని ఫినిష్! పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ నెంబర్ వన్!
Recommended image2
SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ కు బ్యాడ్ న్యూస్.. ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనా? ఓటమికి కారణాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved