ఆ ఇద్దరికీ అవకాశం రాకపోవడానికి వరుణ్ చక్రవర్తియే కారణమా... టీ20 వరల్డ్ కప్‌లో...
ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి, టీమిండియాలో చోటు దక్కించుకున్నారు యంగ్ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్. అయితే సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఐదు మ్యాచుల్లోనూ ఈ ఇద్దరికీ అవకాశం దక్కలేదు...

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందే టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్‌లను ఐదు మ్యాచుల్లో కొనసాగించిన మేనేజ్‌మెంట్, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ని అన్ని మ్యాచుల్లోనూ ఆడించింది...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్రతీ మ్యాచ్‌లోనూ 150 కి.మీ.ల వేగంతో బంతులు విసిరిన ఉమ్రాన్ మాలిక్‌కి ఒక్క అవకాశం ఇవ్వకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఉమ్రాన్ మాలిక్‌ని ఈ సిరీస్‌లో కచ్ఛితంగా ఆడిస్తారని భావించారు చాలా మంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్...
అలాగే ఐపీఎల్ 2021 సీజన్ నుంచి అదరగొడుతున్న అర్ష్‌దీప్ సింగ్, శ్రీలంక టూర్‌లోనే ఆరంగ్రేటం చేయాల్సింది. అయితే అప్పుడు రిజర్వు బెంచ్‌లో ఉన్న ప్లేయర్లందరికీ అవకాశం వచ్చినా, పాపం అర్ష్‌దీప్ సింగ్ మాత్రం తుదిజట్టులోకి రాలేకపోయాడు...
డెత్ ఓవర్లలో టాప్ క్లాస్ బౌలింగ్‌తో వరల్డ్ క్లాస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన అర్ష్‌దీప్ సింగ్, టీమిండియాకి డెత్ ఓవర్ స్పెషలిస్టుగా మారతాడని భావించారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అయితే అర్ష్‌దీప్ సింగ్‌కి కూడా ఈ సిరీస్‌లో అవకాశం దక్కలేదు..
ఈ ఇద్దరికీ టీ20 సిరీస్‌లో ఛాన్సు దక్కకపోవడానికి భారత స్పిన్నర్, కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తియే కారణమంటున్నారు కొందరు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. దీనికి కారణం లేకపోలేదు...
Varun Chakravarthy
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన వరుణ్ చక్రవర్తి, 2021 ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2021 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అప్పటిదాకా టీమిండియాకి ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్‌ని పక్కనబెట్టి వరుణ్ చక్రవర్తిని సెలక్ట్ చేసింది బీసీసీఐ...
అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఈ ‘మిస్టరీ స్పిన్నర్’ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. వికెట్లు తీయలేకపోగా భారీగా పరుగులు సమర్పించి, టీమిండియా ఓటమికి కారణమయ్యాడు... పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని వరుణ్ చక్రవర్తిని, టీ20 వరల్డ్ కప్ ఆడించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ కారణంగానే ఐపీఎల్ పర్ఫామెన్స్‌ని ప్రమాణీకంగా తీసుకుని టీ20 వరల్డ్ కప్ ఓడించే సాహసం చేయడానికి టీమిండియా సిద్ధంగా లేదని, అందుకే ప్రపంచ కప్ కి ముందు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లను ఆడించి కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం ఇష్టం లేకనే వారిని పక్కనబెట్టిందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన టీ నటరాజన్, ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించి భారత జట్టుకి వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు బ్రిస్బేన్ టెస్టులో విజయాన్ని అందించాడు. అయితే ఆ తర్వాత గాయాలతో టీమ్‌కి దూరమయ్యాడు.. నట్టూ, వరుణ్ చక్రవర్తిల కారణంగానే యంగ్ స్టర్స్‌కి అవకాశాలు ఇచ్చేందుకు టీమిండియాకి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..