MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Tirumala : ఇక ఈ రైలెక్కితే చాలు.. చాలా తొందరగా తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం

Tirumala : ఇక ఈ రైలెక్కితే చాలు.. చాలా తొందరగా తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం

తిరుమల భక్తులతో పాటు ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక విజయవాడ, తిరుమల, బెంగళూరు మధ్య వందే భారత్ రైలు నడవనుంది. దీంతో ఈ నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఎంత సమయం ఆదా అవుతుందో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 20 2025, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐటీ ఉద్యోగులు, శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
Image Credit : CHATGPT

ఐటీ ఉద్యోగులు, శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

Vande Bharat Express : ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుండి ఐటీ సిటీ బెంగళూరు, టెంపుల్ సిటీ తిరుపతికి అనేక రైళ్లు నడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రెండు నగరాలను విజయవాడతో పాటు మరికొన్ని పట్టణాలను కనెక్ట్ చేస్తూ వందేభారత్ రైలు నడిపేందుకు సిద్దమయ్యింది. దీంతో తెలుగు ప్రజలు మరింత ఈజీగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని తొందరగా దర్శించుకోవచ్చు. ఈ వందేభారత్ ట్రైన్ ప్రయాణం సమయాన్ని విజయవాడ, బెంగళూరు మధ్య ప్రయాణ సమయాన్ని కూడా చాలా తగ్గిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయవాడ-బెంగళూరు మధ్య తగ్గనున్న ప్రయాణసమయం
Image Credit : Asianet News

విజయవాడ-బెంగళూరు మధ్య తగ్గనున్న ప్రయాణసమయం

ప్రస్తుతం విజయవాడ నుండి బెంగళూరుకు ట్రైన్ లో వెళ్లాలంటే 12 గంటలకు పైనే సమయం పడుతుంది... అంటే సగం రోజు ప్రయాణానికే సరిపోతుంది. అయితే హైస్పీడ్ వందే భారత్ అందుబాటులోకి వస్తే ఈ విజయవాడ-బెంగళూరు మధ్య ప్రయాణ సమయం కేవలం తొమ్మిది గంటలే. అంటే దాదాపు మూడు నుండి నాలుగు గంటల సమయం ఆదా అవుతుంది. ఇదే సమయంలో కేవలం నాలుగున్నర గంటల్లోనే విజయవాడ-తిరుపతి మధ్య ప్రయాణం సాగించవచ్చు.

35
విజయవాడ-బెంగళూరు వందేభారత్ టైమింగ్స్ :
Image Credit : Asianet News

విజయవాడ-బెంగళూరు వందేభారత్ టైమింగ్స్ :

ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకను కలుపుతూ మరో కొత్త వందేభారత్ ట్రైన్ నడిపేందుకు రైల్వే శాఖ సిద్దమయ్యింది. ఈ రైలు ఏపీలోని విజయవాడ నుండి కర్ణాటక రాజధాని బెంగళూరుకు నడుస్తుంది. వారంలో ఆరురోజుల పాటు ఈ రైలు అందుబాటులో ఉంటుంది... కేవలం మంగళవారం మాత్రమే అందుబాటులో ఉండదు. విజయవాడ నుండి ప్రతిరోజు తెల్లవారుజామున 5.15 గంటలకు బయలుదేరుతుంది... 2.15 కు బెంగళూరు చేరుకుంటుంది. అలాగే 2.45 కు బెంగళూరు నుండి తిరుగుపయనమై రాత్రి 11.45 కు విజయవాడకు చేరుకుంటుంది.

ఈ రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు మీదుగా బెంగళూరు చేరుకుంటుంది. విజయవాడలో తెల్లవారుజామున ప్రారంభమైతే ఉదయం 9.45 గంటలకు తిరుపతి చేరుకోవచ్చు. అక్కడినుండి తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శనం తొందరగా చేసుకుంటే ఇదే రైలులో తిరిగి విజయవాడకు చేరుకోవచ్చు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.55కి ఈ వందేభారత్ తిరుపతి స్టేషన్ కు చేరుకుంటుంది.

45
తీరనున్న ప్రయాణికుల కష్టాలు
Image Credit : Google

తీరనున్న ప్రయాణికుల కష్టాలు

ఐటీ సిటీ బెంగళూరుకు ఆంధ్ర ప్రదేశ్ నుండి నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారు. వారాంతాల్లో అయితే మరింత ఎక్కువమంది రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ విజయవాడ, బెంగళూరు మధ్య కేవలం కొండవీడు ఎక్స్ ప్రెస్ మాత్రమే నడుస్తోంది... మచిలీపట్నం నుండి యశ్వంత్ పురాకు వెళ్లే ఈ రైలు 3 రోజులు మాత్రమే నడుస్తుంది. దీంతో మిగతారోజుల్లో ఈ నగరాల మధ్య ప్రయాణించేవారు బస్సులనో లేదంటే విమానాన్నో ఆశ్రయించాల్సి వచ్చేది.

55
విజయవాడోళ్లకు గుడ్ న్యూస్
Image Credit : Google

విజయవాడోళ్లకు గుడ్ న్యూస్

అయితే వందే భారత్ రైలు అందుబాటులో రావడంతో విజయవాడ, బెంగళూరు మధ్య ప్రయాణం మరింత సులువు కానుంది.. వేగవంతమైన ప్రయాణంతో సమయం కూడా ఆదా కానుంది. తిరుపతికి వెళ్లే శ్రీవారి భక్తులకు కూడా ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. విజయవాడ, బెంగళూరు మధ్య వందేభారత్ రైలు నడపడంపై ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి
ప్రయాణం
బెంగళూరు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
200 Vande Bharat Trains వామ్మో.. 200 వందే భారత్, 50 నమో భారత్ రైళ్లా? ప్రయాణికుల కష్టాలు తీరినట్టేగా!
Recommended image2
Vijayawda-Visakhapatnam: గంటలో విజయవాడ నుంచి వైజాగ్ కి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved