MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ ఆట ఆగాల్సిందే! రాజస్థాన్ రాయల్స్‌పై ఎఫ్ఐఆర్.. అసలేం జరుగుతోంది?

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ ఆట ఆగాల్సిందే! రాజస్థాన్ రాయల్స్‌పై ఎఫ్ఐఆర్.. అసలేం జరుగుతోంది?

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆడించడం బాల కార్మిక చట్టాల ఉల్లంఘనే అని సామాజిక కార్యకర్త శివకుమార్ నాయక్ హెచ్చరించారు. రాజస్థాన్ రాయల్స్‌పై ఎఫ్ఐఆర్ కు సిద్ధమయ్యారు. అసలేం జరుగుతోంది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 06 2026, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్కూలుకు వెళ్లాల్సిన పిల్లాడితో క్రికెటా? ఐపీఎల్ సంచలనం వైభవ్‌పై కేసు.. RR టీమ్ షాక్!
Image Credit : ANI

స్కూలుకు వెళ్లాల్సిన పిల్లాడితో క్రికెటా? ఐపీఎల్ సంచలనం వైభవ్‌పై కేసు.. RR టీమ్ షాక్!

ఐపీఎల్ 2026లో తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు చిక్కులో పడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున ఆడుతున్న ఈ బీహార్ సంచలనంపై కర్ణాటకకు చెందిన సామాజిక కార్యకర్త సీఎం శివకుమార్ నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. వైభవ్‌ను ప్రొఫెషనల్ లీగ్‌లో ఆడించడం ‘బాల కార్మిక వ్యవస్థ’ కిందకే వస్తుందని ఆయన వాదిస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తానని హెచ్చరించడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్కూలుకు వెళ్లాల్సిన వయసులో ఇదేం పని?
Image Credit : cricketers instagram

స్కూలుకు వెళ్లాల్సిన వయసులో ఇదేం పని?

ఒక కన్నడ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో శివకుమార్ నాయక్ మాట్లాడుతూ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై నిప్పులు చెరిగారు. "ఈ 15 ఏళ్ల బాలుడు వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ వేధిస్తోంది. వాడు ఇంకా చిన్న పిల్లాడు, అలాంటి వాడిని తీసుకొచ్చి ఐపీఎల్ లాంటి ప్రొఫెషనల్ లీగ్‌లో ఆడించడం బాల కార్మిక వ్యవస్థ కాక మరేమిటి? ఈ వయసులో అతను స్కూలుకు వెళ్లి చదువుకోవాలి కానీ, ఇలా క్రికెట్ ఆడటం ఏంటి?" అని ఆయన ప్రశ్నించారు. వెంటనే వైభవ్‌ను లీగ్ నుంచి తప్పించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన డిమాండ్ చేశారు.

35
రికార్డుల వేటలో వైభవ్ సూర్యవంశీ
Image Credit : ANI

రికార్డుల వేటలో వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం తన ఆటతో సంచలనంగా మారాడు. మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ ఆడుతూ, సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇందులో 12 సిక్సర్లు ఉండటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. 

అంతేకాకుండా, టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో (473 బంతులు) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కూడా రికార్డ్ సృష్టించాడు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి దిగ్గజ బౌలర్లను సైతం ఈ కుర్రాడు చీల్చి చెండాడుతున్నాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 404 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ తరపున లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు.

45
చట్టం ఏం చెబుతోంది? ఐసీసీ రూల్స్ ఏంటి?
Image Credit : ANI

చట్టం ఏం చెబుతోంది? ఐసీసీ రూల్స్ ఏంటి?

ఈ ‘బాల కార్మిక’ ఆరోపణలు హెడ్‌లైన్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నా, చట్టపరంగా ఇందులో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి.

• ఐసీసీ నిబంధనలు: అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి కనీస వయసు 15 ఏళ్లు. అయితే అసాధారణ ప్రతిభ ఉన్న వారిని అంతకంటే తక్కువ వయసులోనూ అనుమతించవచ్చు.

• బీసీసీఐ నిబంధనలు: వైభవ్ ఇప్పటికే 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరపున రంజీ ట్రోఫీ (ఫస్ట్ క్లాస్ క్రికెట్) ఆడాడు. ఆ లెక్కన అతను ఒక ‘ప్రొఫెషనల్ అథ్లెట్’.

• భారత చట్టం: 14 ఏళ్లలోపు పిల్లలు పని చేయకూడదు. కానీ 14 నుండి 18 ఏళ్ల వయసు గలవారు ప్రమాదకరం కాని పనుల్లో పాల్గొనవచ్చు. క్రీడలు, కళలు వంటివి ఈ చట్టం పరిధిలోకి రావు.

55
వివాదాల సుడిగుండంలో వైభవ్ సూర్యవంశీ
Image Credit : ANI

వివాదాల సుడిగుండంలో వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీకి వివాదాలు కొత్తేమీ కాదు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. వైభవ్ బ్యాట్‌లో AI చిప్ ఉందని పాకిస్థాన్ విశ్లేషకుడు నౌమాన్ నియాజ్ ఆరోపించగా, జితేష్ శర్మ అతన్ని అన్‌ప్రొఫెషనల్ అని జోక్ చేశాడు. ఆ తర్వాత అది ఐస్ క్రీం తింటున్న పిల్లాడని సరదాగా అన్నానని క్లారిటీ ఇచ్చాడు. 

ఇప్పుడు సామాజిక కార్యకర్త నుండి లీగల్ నోటీసుల భయం పొంచి ఉంది. ఐర్లాండ్ పర్యటన కోసం ప్రకటించిన 35 మంది ప్రాబబుల్స్ లిస్టులోనూ వైభవ్ పేరు ఉండటం గమనార్హం. ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ దొరికిపోయి వివాదంలో ఉండగా, ఇప్పుడు వైభవ్ ఇష్యూ టీమ్‌ను మరింత ఇరకాటంలో పడేసింది. మరి ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు షురూ.. ఎవరికి ఛాన్స్? ఎవరికి షాక్? పాయింట్ల పట్టిక లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
Recommended image2
IPL 2026 Final: ఆర్సీబీ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. బెంగళూరు నుంచి ఫైనల్ మ్యాచ్ అవుట్ ! కారణం ఏమిటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved