MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 Final: ఆర్సీబీ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. బెంగళూరు నుంచి ఫైనల్ మ్యాచ్ అవుట్ ! కారణం ఏమిటి?

IPL 2026 Final: ఆర్సీబీ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. బెంగళూరు నుంచి ఫైనల్ మ్యాచ్ అవుట్ ! కారణం ఏమిటి?

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్ జరిగే గ్రౌండ్ మారింది. బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు మ్యాచ్‌ను మారుస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమిటి? 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 06 2026, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐదేళ్లలో నాలుగోసారి.. అహ్మదాబాద్‌కే మళ్ళీ ఐపీఎల్ ఫైనల్ ఛాన్స్
Image Credit : Gemini

ఐదేళ్లలో నాలుగోసారి.. అహ్మదాబాద్‌కే మళ్ళీ ఐపీఎల్ ఫైనల్ ఛాన్స్

ఐపీఎల్ లవర్స్‌కు బీసీసీఐ ఒక బిగ్ షాక్ ఇచ్చింది. 2026 ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ గ్రౌండ్ ను మారుస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిజానికి ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) హోమ్ గ్రౌండ్ అయిన ఎం. చిన్నాస్వామి స్టేడియంలో ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా ఈ మెగా ఫైట్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి తరలించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫైనల్ మ్యాచ్ ను బెంగళూరు నుంచి ఎందుకు మార్చారు?
Image Credit : X@IPL

ఫైనల్ మ్యాచ్ ను బెంగళూరు నుంచి ఎందుకు మార్చారు?

బీసీసీఐ తన మీడియా అడ్వైజరీలో ఫైనల్ మ్యాచ్ గ్రౌండ్ మార్పుల గురించి స్పష్టత ఇచ్చింది. మొదట బెంగళూరునే ఫైనల్ మ్యాచ్ కు గ్రౌండ్ గా అనుకున్నప్పటికీ, అక్కడి లోకల్ అసోసియేషన్, అధికారుల నుంచి వచ్చిన కొన్ని డిమాండ్లు బీసీసీఐ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని సమాచారం. 

ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో టికెట్ల అమ్మకాలు, కేటాయింపుల్లో జరుగుతున్న అడ్మినిస్ట్రేటివ్ గందరగోళం వల్లే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సేఫ్ ఆప్షన్‌గా మళ్ళీ అహ్మదాబాద్‌నే ఎంచుకున్నారు.

Related Articles

Related image1
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు షురూ.. ఎవరికి ఛాన్స్? ఎవరికి షాక్? పాయింట్ల పట్టిక లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
Related image2
IPL 2026: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్య.. హార్దిక్ పాండ్యాను ఎందుకు తొలగించారు?
35
అహ్మదాబాద్‌కే మొగ్గు.. ఎందుకంటే?
Image Credit : Getty

అహ్మదాబాద్‌కే మొగ్గు.. ఎందుకంటే?

గత ఐదేళ్లలో అహ్మదాబాద్ ఐపీఎల్ ఫైనల్ హోస్ట్ చేయడం ఇది నాలుగోసారి. 2022, 2023, 2025 లలో కూడా ఇక్కడే ఫైనల్స్ జరిగాయి. ఈ స్టేడియంకు ఉన్న భారీ కెపాసిటీ, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ బీసీసీఐకి పెద్ద ప్లస్ పాయింట్. 2025లో కూడా కోల్‌కతాలో వర్షం ముప్పు ఉండటంతో ఫైనల్‌ను అహ్మదాబాద్‌కు మార్చారు. ఇప్పుడు 2026లో మే 31న జరగబోయే గ్రాండ్ ఫినాలే కూడా నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

45
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ఇదే
Image Credit : X@IPL

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ఇదే

ఈసారి ప్లే ఆఫ్స్ విషయంలో బీసీసీఐ కొత్త ప్రయోగానికి తెరలేపింది. సాధారణంగా క్వాలిఫైయర్-2, ఫైనల్ ఒకే గ్రౌండ్ లో జరుగుతాయి. కానీ ఈసారి మూడు వేర్వేరు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి:

• మే 26: క్వాలిఫైయర్-1 (ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్)

• మే 27: ఎలిమినేటర్ (న్యూ చండీగఢ్ ఇంటర్నేషనల్ స్టేడియం)

• మే 29: క్వాలిఫైయర్-2 (న్యూ చండీగఢ్ ఇంటర్నేషనల్ స్టేడియం)

• మే 31: గ్రాండ్ ఫైనల్ (నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్)

55
గత నిబంధనలకు బ్రేక్
Image Credit : X@IPL

గత నిబంధనలకు బ్రేక్

ఐపీఎల్‌లో ఏ టీమ్ అయితే ఛాంపియన్‌గా నిలుస్తుందో, ఆ తర్వాత ఏడాది ఫైనల్ మ్యాచ్ వారి హోమ్ గ్రౌండ్‌లో జరుగుతుంది. 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ కప్ కొట్టింది. ఆ లెక్కన బెంగళూరులో ఫైనల్ జరగాలి. కానీ లాజిస్టిక్స్, సెక్యూరిటీ రీజన్స్‌తో ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. 2022లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్నా, ఫైనల్‌ను అహ్మదాబాద్‌లోనే నిర్వహించారు.

ఫైనల్ గ్రౌండ్ మారడం ఆర్సీబీ లవర్స్ కు కొంచెం నిరాశను కలిగించే న్యూస్ అయినప్పటికీ, అహ్మదాబాద్‌లోని లక్ష మందికి పైగా ప్రేక్షకుల మధ్య జరిగే ఫైనల్ పోరు నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని క్రికెట్ అనలిస్టులు చెబుతున్నారు. మే 31న జరిగే ఈ బిగ్ బాటిల్‌లో టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Related Stories
Recommended image1
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు షురూ.. ఎవరికి ఛాన్స్? ఎవరికి షాక్? పాయింట్ల పట్టిక లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
Recommended image2
IPL 2026: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్య.. హార్దిక్ పాండ్యాను ఎందుకు తొలగించారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved