MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Vaibhav Sooryavanshi: సంజూ, అభిషేక్‌లలో ఒకరికి షాక్.. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లోకి వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: సంజూ, అభిషేక్‌లలో ఒకరికి షాక్.. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లోకి వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 లో దుమ్మురేపే ఆటలో పరుగుల వర్షం కురిపించిన  రాజస్థాన్ రాయల్స్ యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీని  టీమిండియా ప్లేయింగ్ XIలోకి తీసుకోవాలని సునీల్ గవాస్కర్ అన్నారు. అయితే, వైభవ్ రాకతో సంజూ, అభిషేక్ లలో ఒకరికి షాక్ తగలనుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 07 2026, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. టీమ్ ఇండియాలోకి ఎంట్రీ
Image Credit : Vaibhav Suryavanshi Instagram

సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. టీమ్ ఇండియాలోకి ఎంట్రీ

ఐపీఎల్ 2026లో తన తుపాన్ బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ నిరీక్షణకు తెరపడింది. ఈ యంగ్ స్టార్ అద్భుతమైన ఆటతీరు సెలెక్టర్లను బాగా ఆకట్టుకుంది. దీనితో వైభవ్‌ను మూడు వేర్వేరు టీ20 సిరీస్‌ల కోసం టీమ్ ఇండియా స్క్వాడ్‌కు ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఈ యంగ్ బ్యాటర్‌ను టీమ్ ఇండియా ప్లేయింగ్-XIలోకి ఎలా తీసుకోవాలో లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఒక అదిరిపోయే ప్లాన్ చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సచిన్ టెండూల్కర్ రికార్డ్ బద్దలుకొట్టిన వైభవ్
Image Credit : ANI

సచిన్ టెండూల్కర్ రికార్డ్ బద్దలుకొట్టిన వైభవ్

వైభవ్ సూర్యవంశీ కేవలం భారత జట్టులోకి రావడం మాత్రమే కాదు, ఒక చరిత్రను సృష్టించాడు. ఎన్నో ఏళ్ల క్రితం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఒక అరుదైన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ భారత జట్టులో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. 

ఇప్పుడు సచిన్ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. టీమ్‌లోకి అయితే వచ్చేసాడు కానీ, ఇంతకీ అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎక్కడ అవకాశం దక్కుతుందనేదే ఇప్పుడు అందరి మైండ్‌లో ఉన్న పెద్ద ప్రశ్న.

35
గవాస్కర్ డిమాండ్ ఇదే
Image Credit : IPL MEDIA

గవాస్కర్ డిమాండ్ ఇదే

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ బ్యాటింగ్ విన్యాసాలు చూసిన తర్వాత, చాలా మంది క్రికెట్ దిగ్గజాలు అతడిని టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టాప్ బౌలర్లను సైతం ఏమాత్రం భయం లేకుండా వైభవ్ ఎదుర్కొన్న తీరు అందరినీ ఫిదా చేసింది. 

ఇప్పుడు సునీల్ గవాస్కర్ కూడా వైభవ్‌ను వీలైనంత త్వరగా ప్లేయింగ్-XIలో చేర్చాలని గట్టిగా కోరుతున్నారు. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో వైభవ్ బ్యాటింగ్‌ను చూడటానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని గవాస్కర్ చెప్పారు.

45
సంజూ లేదా అభిషేక్‌లకు షాక్ తప్పదా?
Image Credit : X/BCCI

సంజూ లేదా అభిషేక్‌లకు షాక్ తప్పదా?

సునీల్ గవాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను వైభవ్‌ను ఐర్లాండ్ టి20 సిరీస్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఆడుతుంటే చూడాలని నాకు ఉంది. సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మ కంటే ముందే వైభవ్‌కు అవకాశం ఇవ్వాలి. బహుశా ఒక మ్యాచ్‌లో వైభవ్ కోసం సంజూ లేదా అభిషేక్ బెంచ్‌కు పరిమితం కాక తప్పదు" అని గవాస్కర్ అన్నారు. ః

వైభవ్ రీసెంట్ ఫామ్, అతడు చేసిన పరుగుల వరద చూశాక, అతడిని జట్టు వెలుపల ఉంచడం సాధ్యం కాదని, సెలెక్టర్లు సరైన నిర్ణయమే తీసుకున్నారని గవాస్కర్ అన్నారు.

55
జూన్ 26 నుంచి అసలైన పోరు
Image Credit : BCCI

జూన్ 26 నుంచి అసలైన పోరు

భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జూన్ 26 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గవాస్కర్ మాట్లాడుతూ.. "వైభవ్‌కు మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినా, రాకపోయినా మేము అతని కోసం ఎదురుచూస్తాం. ఏది ఏమైనా, భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో గడపడం అనేది వైభవ్‌కు ఒక గొప్ప అనుభవం అవుతుంది. సీనియర్ల మధ్య నేర్చుకునే విషయాలు అతని కెరీర్‌కు ఫ్యూచర్‌లో బాగా ప్లస్ అవుతాయి" అని చెప్పారు. ఈ టీమ్‌ను ప్రకటించే సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వైభవ్‌పై ప్రశంసల జల్లు కురిపించడం విశేషం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image2
IND vs AFG Test: ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ సెంచరీల వర్షం.. కెప్టెన్ గిల్‌ ఖాతాలో వరల్డ్ రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved