రిషబ్ పంత్ పెద్ద మనసు... ఉత్తరాఖండ్ బాధితుల సహాయార్థం విరాళంగా మ్యాచ్ ఫీజు...

First Published Feb 8, 2021, 12:23 PM IST

తొలి టెస్టులో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన రిషబ్ పంత్, మంచి మనసు చాటుకున్నాడు. ఉత్తరాఖండ్‌లో ఆదివారం సంభవించిన బాధితుల కోసం తన మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించాడు. ఆదివారం జరిగిన ఈ ప్రకృతి ప్రళయంలో ఇప్పటికే 14 మంది ప్రాణాలు కోల్పోగా 170 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంఘటనపై స్పందించిన రిషబ్ పంత్, తన మ్యాచ్ ఫీజును విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటిస్తూ ట్వీట్ చేశాడు.