MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • నేను చేసిన ఆ పనికి రిషబ్ పంత్ ఫీలయ్యాడు... క్లారిటీ ఇచ్చిన ఊర్వశి! వెంటనే రిషబ్ రియాక్షన్...

నేను చేసిన ఆ పనికి రిషబ్ పంత్ ఫీలయ్యాడు... క్లారిటీ ఇచ్చిన ఊర్వశి! వెంటనే రిషబ్ రియాక్షన్...

టీమిండియాలోకి వచ్చి ఐదేళ్లు కూడా కాకపోయినా బీభత్సమైన పాపులారిటీ, క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్... ఆటలోనే కాదు, ఆఫ్ స్క్రీన్ రొమాన్స్‌లోనూ మామూలోడు కాదు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెల్లాతో రిషబ్ పంత్ రిలేషన్ గురించి చాలా వార్తలు వచ్చాయి...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Aug 11 2022, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

వీళ్లిద్దరి మధ్య రిలేషన్‌షిప్ డేటింగ్ దాకా వెళ్తున్న సమయంలోనే రిషబ్ పంత్, సోషల్ మీడియాలో ఊర్వశి రౌతెల్లాని బ్లాక్ చేయడం... మీడియాలో పెద్ద సెన్సేషనల్ వార్తగా మారింది. వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ ఊర్వశికి బ్రేకప్ చెప్పిన రిషబ్ పంత్, ఇషా నేగి అనే మోడల్‌తో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Rishabh Pant Urvashi Rautela

Rishabh Pant Urvashi Rautela

అయితే ఊర్వశి రౌతెల్లా మాత్రం రిషబ్ పంత్‌ని మరిచిపోవడం లేదు. తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేరు చెప్పుకుండా రిషబ్ పంత్‌కీ, తనకీ మధ్య ఎక్కడ తేడా వచ్చిందో బయటపెట్టింది ఊర్వశి రౌతెల్లా...

310

‘వారణాసిలో నేను ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నా.. అక్కడి నుంచి న్యూఢిల్లీలో ఓ షోలో పాల్గొనడానికి ఫ్లైట్ ఎక్కి వచ్చా. న్యూఢిల్లీలో రోజంతా షూటింగ్‌లో పాల్గొన్నా... మళ్లీ ఆ తర్వాతి రోజు ఫ్లైట్ పట్టుకుని, వారణాసికి వెళ్లాలి...

410

ఆ సమయంలో నన్ను కలవడానికి అతను (మిస్టర్ ఆర్‌పీ) వచ్చాడు. నేను ఉంటున్న హోటల్‌కి వచ్చి లాబీలో వెయిట్ చేశాడు. నాకు ఆ విషయం తెలీదు. నేను 10 నిమిషాల ముందే షూటింగ్‌ నుంచి వచ్చి బాగా అలిసిపోయి పడుకున్నా...

510

అతను వచ్చిన విషయం కానీ, నా కోసం వెయిట్ చేస్తున్న విషయం కానీ నాకు తెలీదు.అప్పుడు నాకు ఫోన్ వచ్చింది కానీ ఆ రింగ్ కూడా నాకు వినిపించలేదు. అంతలా అలిసిపోయి మత్తుగా పడుకున్నా...

610

లేచి చూసేసరికి 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను చాలా ఫీల్ అయ్యా.. నా కోసం అతను అంతలా వెయిట్ చేయాల్సి వచ్చిందని బాధపడ్డాను. వెంటనే ఫోన్ చేసి, ముంబై వచ్చాక కలుస్తానని చెప్పాను...

710

చెప్పినట్టే ముంబైకి వచ్చినప్పుడు కలిశాను. అయితే ఆ తర్వాతే ఏం జరిగిందో తెలీదు కానీ అది అక్కడితో తెగిపోయింది. దానిపై మీడియా రకరకాలుగా రాసుకొచ్చింది. మీడియా వార్తల వల్ల కూడా మా మధ్య బంధం పెరగకుండానే చెడిపోయింది...’ అంటూ కామెంట్ చేసింది ఊర్వశి రౌతెల్లా...

810

పేరు చెప్పకపోయినా మిస్టర్ ఆర్‌పీ అంటూ తాను చెబుతున్నది రిషబ్ పంత్ గురించేనంటూ హింట్ ఇచ్చేసింది ఊర్వశి రౌతెల్లా. ఈ ఇంటర్వ్యూ బయటికి వచ్చిన కొద్దిసేపటికే ఇన్‌‌స్టాలో ఓ ఇన్‌డైరెక్ట్ మెసేజ్‌ని పోస్ట్ చేశాడు రిషబ్ పంత్...

910
Rishabh Pant Urvashi Rautela

Rishabh Pant Urvashi Rautela

‘కొందరు పాపులారిటీ కోసం ఇంటర్వ్యూల్లో ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతారో అర్థం కాదు. కేవలం వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తారంటే ఫన్నీగా ఉంది. పేరు కోసం, ఫేమ్ కోసం ఇంతగా పాకులాడేవారిని వారిని చూస్తుంటే బాధగా ఉంటుంది... వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి... ’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్టు చేశాడు రిషబ్ పంత్...

1010

ఊర్వశి రౌతెల్లాని కలవడానికి రిషబ్ పంత్ 16-17 గంటలు ఎదురుచూశాడని వార్తలు వచ్చాయి. దూకుడైన బ్యాటింగ్‌తో అరవీర భయంకర బౌలర్ల బౌలింగ్‌లోనూ షాట్స్ ఆడే రిషబ్ పంత్‌లో ఇంత ఓపిక ఉందా... అని ఆశ్చర్యపోయారు క్రికెట్ ఫ్యాన్స్... 

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved