- Home
- Sports
- Cricket
- టీమిండియాకి రిటైర్మెంట్ ఇచ్చాడు.. ప్రపంచమంతా తిరిగేస్తున్నాడు! బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో ఉన్ముక్త్ చంద్...
టీమిండియాకి రిటైర్మెంట్ ఇచ్చాడు.. ప్రపంచమంతా తిరిగేస్తున్నాడు! బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో ఉన్ముక్త్ చంద్...
ఉన్ముక్త్ చంద్... 10 ఏళ్ల క్రితం భారత క్రికెట్‌లో ఈ పేరు ఓ సంచలనం. అయితే టీనేజ్ వయసులోనే వచ్చిన కొండంత క్రేజ్‌ని సరిగ్గా వాడుకోలేక... స్టార్ క్రికెటర్‌గా ఎదగలేకపోయాడు ఉన్ముక్త్ చంద్. 8 ఏళ్ల పాటు అవకాశాల కోసం ఆశగా ఎదురుచూసి... దేశాన్ని వీడిన ఉన్ముక్త్ చంద్, విదేశీ ఫ్రాంఛైజీ లీగుల్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు...

Unmukt Chand
2012 అండర్19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు ఉన్ముక్త్ చంద్. 2012 అండర్ 19 విజయం తర్వాత బీభత్సమైన క్రేజ్, పాపులారిటీ తెచ్చుకున్న ఉన్ముక్త్ చంద్, దాన్ని సక్రమమైన రీతిలో వాడుకోవడంలో విఫలమయ్యాడు...
క్రికెట్‌లో అ, ఆలు కూడా నేర్వకముందే వచ్చిన క్రేజ్‌ని చూసి అన్నీ తెలిసినవాడిలా మురిసిపోయి ఆటోబయోగ్రఫీలు కూడా రాసేశాడు ఉన్ముక్త్ చంద్. ప్రమోషన్లు, ఈవెంట్లు, ఆడంబరాలపై చూపిన శ్రద్ధ, ఆటపై చూపించకపోవడంతో ఐపీఎల్‌లో విఫలమై, దేశవాళీ టోర్నీలో వివాదాల్లో ఇరుక్కున్నాడు... 9 ఏళ్ల పాటు అవకాశాల కోసం ఎదురుచూస్తూ గడిపేసిన ఉన్ముక్త్ చంద్, 2021లో భారత క్రికెట్‌కి రాజీనామా చేసి యూఎస్‌కి మకాం మార్చాడు...
బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొన్న మొట్టమొదటి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన ఉన్ముక్త్ చంద్, సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫ్రాంఛైజీలన్నీ ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానులకు చెందినవే కావడంతో ఉన్ముక్త్ చంద్‌ని ఎవ్వరూ పట్టించుకోలేదు...
యూఎస్ ‘మైనర్ క్రికెట్ లీగ్’లో పాల్గొన్న ఉన్ముక్త్ చంద్, బిగ్ బాష్ లీగ్ 2022లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరుపున ఆడాడు. 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో యూఎస్‌ఏ జట్టు తరుపున ఆడాలని ఆశపడుతున్న ఉన్ముక్త్ చంద్... బంగ్లా ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనబోతున్నాడు...
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో డ్రాఫ్ట్ అయిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఉన్ముక్త్ చంద్. బీపీఎల్ 2023 సీజన్‌లో చిట్టగాంగ్ ఛాలెంజర్స్ జట్టు తరుపున ఆడేందుకు సిద్దమవుతున్నాడు ఉన్ముక్త్ చంద్...
‘మా జట్టులో ఓ భారతీయుడు ఉండాలనే ఉద్దేశంతో ఉన్ముక్త్ చంద్‌ని తీసుకున్నాం. మాకు ఇండియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఉన్ముక్త్ చంద్ రాకతో అది మరింత పెరుగుతుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు చిట్టగాంగ్ ఛాలెంజర్స్ యజమాని రిఫతుజ్జమన్...