MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • 'రోహిత్ కెప్టెన్సీలో ప్ర‌పంచ‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలుస్తాం.. '

'రోహిత్ కెప్టెన్సీలో ప్ర‌పంచ‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలుస్తాం.. '

World Test Championship : బీసీసీఐ సెక్ర‌ట‌రీ జైషా మాట్లాడుతూ..  "టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కోసం చారిత్రాత్మక విజ‌యాన్ని అందుకున్న  టీమిండియాకు అభినందనలు. ఈ విజయాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలకు అంకితం చేయాలనుకుంటున్నాను. ఏడాది కాలంలో ఇది ఇది మా మూడో ఫైనల్" అని అన్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 07 2024, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

World Test Championship : వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న భార‌త జ‌ట్టుకు బీసీసీఐ సెక్రటరీ జైషా ఆదివారం ఒక వీడియో సందేశంలో అభినంద‌న‌లు తెలిపారు. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీని రోహిత్ శర్మ నాయకత్వంలో గెలుస్తానని ఆయ‌న విశ్వాసం వ్యక్తం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాపై ఐసీసీ టైటిల్ విజయం తర్వాత టీ20ల‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజా, అవుట్‌గోయింగ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ల‌కు ఈ విజ‌యాన్ని అంకితం చేస్తూ జైషా మెన్ ఇన్ బ్లూకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 

37

బీసీసీఐ సెక్ర‌ట‌రీ జైషా మాట్లాడుతూ..  "టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కోసం చారిత్రాత్మక విజ‌యాన్ని అందుకున్న  టీమిండియాకు అభినందనలు. ఈ విజయాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలకు అంకితం చేయాలనుకుంటున్నాను. ఏడాది కాలంలో ఇది ఇది మా మూడో ఫైనల్" అని అన్నారు.

47

అలాగే, "మేము జూన్ 2023లో వ‌ర‌ల్డ్ టెస్ట్  ఛాంపియన్‌షిప్ ఫైనల్ వెళ్లాము కానీ, అడుగు దూరంలో కోల్పోయాము. నవంబర్ 2023లో పది వరుస విజయాలతో మేము చాలా హృదయాలను గెలుచుకున్నాము, కానీ వ‌న్డే ప్ర‌పంచ కప్‌ను గెలవలేకపోయాము. 2024 జూన్‌లో కప్ గెలుస్తాము అని నేను రాజ్‌కోట్‌లో చెప్పాను... భార‌త జెండాను ఎగుర‌వేస్తామ‌ని అన్నాను.. కెప్టెన్ స‌రిగ్గా అదే చేశారు" అని ప్ర‌శంస‌లు కురిపించారు. 
 
 

57

టీ20 ప్ర‌పంచ కప్ 2024 పైన‌ల్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు కీల‌క స‌మ‌యంలో వికెట్లు తీయగా, సూర్యకుమార్ యాదవ్ బౌండ‌రీలైన్ వ‌ద్ద అద్భుత‌మైన క్యాచ్ తో భార‌త్ ను విజ‌య‌తీరాల‌కు చేర్చార‌ని జైషా కొనియాడారు.

67
Rohit Sharma-Virat Kohli Hug

Rohit Sharma-Virat Kohli Hug

"ఫైనల్‌లో చివరి ఐదు ఓవర్లు ఈ విజయానికి పెద్ద సహకారం అందించాయి. దీనిని సాధించిన సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.

77

రోహిత్ సారథ్యంలో మ‌రో రెండు టైటిళ్ల‌ను గెల‌వ‌డానికి భార‌త్ ప్ర‌యాణం సాగిస్తోంనీ, వ‌చ్చే ఏడాది ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్, ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
రోహిత్ శర్మ
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Recommended image2
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Recommended image3
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved