- Home
- Sports
- Cricket
- అవకాశం వస్తే అతన్ని కూడా ఆడిస్తాం... టీ20 వరల్డ్ కప్ జట్టుపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్...
అవకాశం వస్తే అతన్ని కూడా ఆడిస్తాం... టీ20 వరల్డ్ కప్ జట్టుపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఎదురైన అనుభవాల కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసే జట్టుపై చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది టీమిండియా మేనేజ్‌మెంట్. పొట్టి ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో జరిగిన టీ20 సిరీస్‌లు ఆడిన టీమిండియా... చాలామంది కొత్త ప్లేయర్లకు అవకాశాలు ఇచ్చింది...

ఐపీఎల్ 2021 టోర్నీ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, రవి భిష్ణోయ్‌ల కంటే ఐపీఎల్ 2022లో దుమ్మురేపిన ఉమ్రాన్ మాలిక్, టీ20 వరల్డ్ కప్ 2022 ఆడతాడా? అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది...
Image credit: PTI
పెద్దగా దేశవాళీ టోర్నీలు ఆడిన అనుభవం కానీ, ఐపీఎల్‌లో కనీసం రెండు సీజన్లు పూర్తిగా ఆడిన అనుభవం కూడా లేని ఉమ్రాన్ మాలిక్‌ని టీ20 వరల్డ్ కప్ వంటి టోర్నీ ఆడించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు కొందరు మాజీ క్రికెటర్లు...
ఇంతకుముందు ఇలాగే ఐపీఎల్ 2020 పర్ఫామెన్స్‌ని చూసి ‘మిస్టరీ స్పిన్నర్’ అంటూ వరుణ్ చక్రవర్తిని, స్పిన్ బౌలర్ రాహుల్ చాహార్‌లకు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో చోటు కల్పించి, చేతులు కాల్చుకుంది భారత జట్టు...
అయితే అవకాశం దొరికితే ఉమ్రాన్ మాలిక్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడించి తీరతామని కామెంట్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మ...
Image credit: PTI
‘ఉమ్రాన్ మాలిక్ కూడా మా ప్లాన్స్‌లో ఉన్నాడు. టీమ్‌కి ఏం కావాలో తెలుసుకోవడానికి అతనికి కాస్త సమయం ఇవ్వాలని అనుకుంటున్నాం. అందుకే అతన్ని సౌతాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్‌లకు ఎంపిక చేయడం జరిగింది...
అవును, ఈసారి కొందరు కొత్త కుర్రాళ్లను ఆడించాలనే ఆలోచన ఉంది. వారిలో ఉమ్రాన్ మాలిక్ కూడా ఒకడు. వరల్డ్ కప్‌లో అతను మాకు ఎలా ఉపయోగపడతాడే విషయాన్ని గమనిస్తున్నాం...
Image credit: PTI
ఉమ్రాన్ మాలిక్‌లో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఐపీఎల్‌లో అతని బౌలింగ్ స్పీడ్ చూసి షాక్ అయ్యా. అయితే టీమ్‌లో అతనికి ప్లేస్ ఇవ్వడమంటే ఓ కొత్త రోల్ ఇచ్చినట్టే. అతన్ని ఆరంభ ఓవర్లలో వేయించాలా? లేదా మిడిల్ ఓవర్లలో వాడుకోవాలి? అనేది కూడా పరీక్షిస్తున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన ఉమ్రాన్ మాలిక్, 14 మ్యాచులు ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు...