అంపైర్ ఇలా చేశాడేంటి... మ్యాచ్‌లో చేయకూడని పనితో కెప్టెన్‌కి సాయం...

First Published 29, Oct 2020, 7:07 PM

IPL 2020 సీజన్‌లో అంపైర్లను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ధోనీ వైడ్ వాల్ వివాదం ముగియకముందే మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో అంపైర్ చేసిన ఓ చిన్న తప్పిదం వివాదాస్పదమైంది. ఈ తప్పిదం వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కూసింత ప్రయోజనం దక్కగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కి పెద్ద నష్టమేమీ జరగలేదు.

సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో భారీ విజయం దక్కించుకుంది ఆరెంజ్ ఆర్మీ. వృద్ధమాన్ సాహా 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 66, మనీశ్ పాండే 44 పరుగులు చేశారు.

220 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... 19 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రిషబ్ పంత్ 36, అజింకా రహానే 26 మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు.

ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 17వ ఓవర్‌ వేసేందుకు బంతి తీసుకున్నాడు సన్‌రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ. క్రీజులో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు.

బంతిని ఆడే ప్రయత్నంలో రవిచంద్రన్ అశ్విన్ ప్యాడ్‌కి తగిలింది బాల్. దీంతో వెంటనే సందీప్ శర్మతో పాటు వికెట్ కీపర్, పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ కూడా అవుట్ కోసం అప్పీలు చేశాడు.

దీంతో వెంటనే స్పందించిన అంపైర్ అనిల్ చౌదరి... బంతి బ్యాటుకి తగిలిందని చేతులతో సిగ్నల్ ఇచ్చాడు. అంపైర్ ఇలా స్పందించడం నిబంధనలకు విరుద్ధం.

అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం అంపైర్, బ్యాట్స్‌మెన్ నాటౌట్‌ అని భావిస్తే తలలు అడ్డంగా ఊపుతూ సైగ చేయొచ్చు. అంతేకానీ ఎందుకు అవుట్ కాదో తెలిసినా చూపించకూడదు.

రివ్యూ తీసుకునేందుకు అనుమతి ఉన్న 15 సెకన్లు ముగిసిన తర్వాత కావాలంటే బంతి బ్యాట్‌కి తగిలిందా? లేదా? వంటి చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలా చేయడం వల్ల ఓ జట్టుకు సహాయపడట్టు అవుతుంది.

బ్యాటుకి తగిలిందని అంపైర్ సిగ్నల్ చేయడంతో రివ్యూకి వెళ్లలేదు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ఒకవేళ అంపైర్ ఇలా సిగ్నల్ చేయకపోయి ఉంటే రివ్యూకి వెళ్లేవాడేమో, రిప్లైలో బ్యాటుకి తగిలినట్టు కనిపిస్తే రివ్యూలో కోల్పోయేవాడు.

ఇలా జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్‌కి కాస్త ఫేవర్ జరిగేది. ఆటగాళ్లు ఎంతగా అప్పీలు చేస్తున్నా చలించకుండా విగ్రహంలా నిల్చోవాలి అంపైర్. దానికి విరుద్ధంగా అనిల్ చౌదరి ప్రవర్తించడం వివాదాలకు కారణమైంది.

అయితే ఈ తప్పిదానికి చాలా ముందే మ్యాచ్ వన్‌సైడ్ కావడంతో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు అభిమానులు.