ఉమేశ్‌కి గాయం... ఆస్ట్రేలియాకి కలిసొస్తున్న అంపైర్స్ కాల్ నిర్ణయాలు... సచిన్, షేన్ వార్న్ అసంతృప్తి...
First Published Dec 28, 2020, 9:37 AM IST
బాక్సింగ్ డే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను స్వల్ప స్కోరుకే కట్టడి చేయాలని భావించిన టీమిండియాకు పెద్దగా అదృష్టం కలిసి రావడం లేదు. 15 ఓవర్లలో రెండు సార్లు రివ్యూ తీసుకున్న టీమిండియాకి అంపైర్ కాల్స్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అంపైర్స్ కాల్ నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. రెండు వికెట్లు తీసినా అంపైర్స్ కాల్ కారణంగా రెండు సార్లు బౌలర్లకు వికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ‘అంపైర్స్ కాల్’ రూల్‌ను మార్చాలని కోరడం విశేషం.

మూడో ఓవర్ మొదటి బంతికే ఆసీస్ ఓపెనర్ జో బర్న్స్‌ను ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీలు చేసింది టీమిండియా... అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.

బుమ్రా మీద ఉన్న నమ్మకంతో రివ్యూ తీసుకున్నాడు కెప్టెన్ అజింకా రహానే. టీవీ రిప్లైలో బంతి వికెట్ల అంచునకు తాకినట్టు కనిపించినా... అంపైర్ కాల్ నిబంధన కింద నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?