MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీతో టాప్ తమిళ నటి సెల్ఫీ వైరల్ - సినిమాలో నటిస్తున్నారా?

విరాట్ కోహ్లీతో టాప్ తమిళ నటి సెల్ఫీ వైరల్ - సినిమాలో నటిస్తున్నారా?

Virat Kohli: విరాట్ కోహ్లీకి భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అన్ని రంగాల నుంచి కోహ్లీని అభిమానించే వారు ఉన్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Sep 14 2024, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
క్రికెటర్ విరాట్ కోహ్లీ

క్రికెటర్ విరాట్ కోహ్లీ

1988లో జన్మించిన విరాట్ కోహ్లీ వయస్సు 35 సంవత్సరాలు, 13 సంవత్సరాల వయస్సు నుండి క్రికెట్ ప్రపంచంలో ప్రయాణిస్తున్న అత్యుత్తమ ఆటగాడు. అద్భుతమైన తన కెరీర్ లో కోట్లాది మంది మనసులు గెలుచుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
క్రికెటర్ విరాట్

క్రికెటర్ విరాట్

అక్టోబర్ 2002లో విరాట్ కోహ్లీ జూనియర్ క్రికెట్ ప్రయాణం ప్రారంభమైంది. తన అద్భుతమైన ప్రతిభతో చాలా త్వరగానే "అండర్ 19" పోటీల్లో పాల్గొనే అవకాశం అతనికి లభించింది. ఆగస్టు 2008లో శ్రీలంకకు వెళ్లిన భారత జట్టులో కోహ్లీ కూడా చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీకి ఇదే తొలి విదేశీ వన్డే పర్యటన.

అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. అద్భుతమైన ఆటతో స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. క్రికెట్ లో సంచలన ఇన్నింగ్స్ లు ఆడి భారత్ కు అనేక విజయాలు అందించాడు. లెజెండరీ ప్లేయర్ల రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. ఇప్పుడు  భారతీయులకు అభిమాన క్రికెటర్‌గా  మారాడు.

34
నటి రాధిక

నటి రాధిక

తన 22 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో ప్రస్తుతం ప్రపంచమే మెచ్చుకునే ప్రముఖ భారత క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.  2017లో ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. అయితే, ఇప్పుడు ఓ ప్రముఖ నటితో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె రాధికా శరత్ కుమార్. 

తమిళ చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే గత 45 సంవత్సరాలుగా అగ్రశ్రేణి నటిగా రాణిస్తున్నారు రాధిక శరత్‌కుమార్. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగ నాయగన్ కమల్, కెప్టెన్ విజయకాంత్, తమిళన్ సత్యరాజ్.. ఇలా తమిళ సినీ పరిశ్రమలో జోడీ కట్టని స్టార్ హీరోలు లేరంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, తన మనసులోని మాటను ఎలాంటి సంకోచం లేకుండా, బహిరంగంగా చాలా దైర్యంగా మాట్లాడే కొద్ది మంది నటీమణుల్లో ఆమె కూడా ఒకరు.

44
విరాట్ కోహ్లీ రాధిక

విరాట్ కోహ్లీ రాధిక

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6న తన నటనలో రూపొందిన "లిటిల్ జాఫ్నా" అనే ఫ్రెంచ్ చిత్రం కార్యక్రమం కోసం ఆమె విదేశాలకు వెళ్లారు. అదే విమానంలో విరాట్ కోహ్లీ కూడా ప్రయాణించినట్లు సమాచారం. అతనితో ఫోటో దిగిన రాధిక.. "తనకు చాలా ఇష్టమైన క్రీడాకారుడు, భారతీయులందరికీ ఇష్టమైన క్రీడాకారుడు అయిన కోహ్లీతో అద్భుతమైన ఫోటో దిగడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని" చెప్పారు.

ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఈ ఫోటోలో రాధికా-విరాట్ కోహ్లీ ఇద్దరూ రిలాక్స్‌డ్‌గా, క్యాజువల్‌గా కనిపించారు. బంగ్లాదేశ్‌తో జరగబోయే భారత టెస్ట్ సిరీస్‌కు సిద్ధమయ్యే మార్గంలో ఉన్న కోహ్లి, సాధారణ ఆఫ్-వైట్ టీ-షర్టును ధ‌రించి ఉన్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్‌లు అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌ట్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 

 

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved