MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Top 5 All Rounders : ప్రత్యర్థుల వెన్నులో వణుకుపుట్టించిన టాప్ 5 ఆల్ రౌండర్లు వీళ్లే..

Top 5 All Rounders : ప్రత్యర్థుల వెన్నులో వణుకుపుట్టించిన టాప్ 5 ఆల్ రౌండర్లు వీళ్లే..

క్రికెట్‌లో ఆల్ రౌండర్ పాత్ర ఎప్పుడూ చాలా కీలకం. బ్యాట్, బంతితో  రాణించి జట్టుకు విజయాలు అందించడమే ఆల్ రౌండర్ పని. ఇలా తమ అద్బుత ఆల్రౌండ్ షో తో గుర్తింపుపొందిన టాప్ 5 క్రికెటర్లు ఎవరో తెలుసా?   

1 Min read
Author : Arun Kumar P
Published : Jan 30 2026, 07:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్రికెట్ చరిత్రలో భయంకర ఆల్ రౌండర్లు వీళ్లే..
Image Credit : Getty

క్రికెట్ చరిత్రలో భయంకర ఆల్ రౌండర్లు వీళ్లే..

క్రికెట్ అనేది బ్యాట్, బంతితో ఆటగాళ్లు తమ సత్తా చాటే ఆట. బ్యాటింగ్‌కు ప్రత్యేక బ్యాటర్లు, బౌలింగ్‌కు స్పెషలిస్ట్ బౌలర్లు ఉంటారు. కానీ ఆల్ రౌండర్లు రెండు విభాగాల్లోనూ అదరగొడతారు. ఇలా వరల్డ్ క్రికెట్ ఇటు బ్యాట్, అటు బంతితో అదరగొడుతూ ప్రత్యర్థులకు నిద్రపట్టకుండా చేసిన ఐదుగురు భయంకర ఆల్ రౌండర్ల గురించి ఇక్కడ చూద్దాం.

26
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)
Image Credit : Getty

జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)

క్రికెట్‌లో ఆల్ రౌండర్ అనే పదానికి సరైన నిర్వచనం జాక్వెస్ కలిస్. అతను దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు వెన్నెముక. టెస్టుల్లో 45 సెంచరీలు, 13089 పరుగులు, 292 వికెట్లు తీశాడు. వన్డేల్లో 11579 పరుగులు, 273 వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాత ఎందరో వచ్చినా కలిస్ కాలేకపోయారు… ఆ స్థాయిలో ఆల్రౌండ్ షో చేయలేకపోయారు. 

Related Articles

Related image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Related image2
Top 10 Countries : ఆసియాలోనే అత్యంత క్వాలిటీ లైఫ్ కలిగిన 10 దేశాలు.. ఇండియా, పాకిస్థాన్ ల స్థానం ఎంత.?
36
ఇయాన్ బోథమ్ (ఇంగ్లాండ్)
Image Credit : Getty

ఇయాన్ బోథమ్ (ఇంగ్లాండ్)

ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఒంటిచేత్తో మ్యాచ్‌ను మార్చే సత్తా ఉన్న ఆటగాడు సర్ ఇయాన్ బోథమ్. అతను మైదానంలోకి దిగితే ప్రత్యర్థి జట్టు మైండ్‌సెట్ మారిపోయేది. 1981 యాషెస్ సిరీస్‌ను ఇప్పటికీ బోథమ్ సిరీస్ అంటారు. 102 టెస్టుల్లో 5200 పరుగులు, 383 వికెట్లు తీశాడు.

46
ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్)
Image Credit : Getty

ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్)

పాకిస్తాన్ పేరును ప్రపంచ క్రికెట్‌లో నిలబెట్టిన ఆటగాడు ఇమ్రాన్ ఖాన్. అతను పాక్ జట్టుకు ఒక గుర్తింపు. డ్రెస్సింగ్ రూమ్‌లో భయాన్ని పోగొట్టిన కెప్టెన్. అతని స్వింగ్, వేగానికి గొప్ప బ్యాటర్లు కూడా తలవంచేవారు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించేవాడు.

56
షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)
Image Credit : Getty

షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియా జట్టులో ఎందరో మ్యాచ్ విన్నర్లు ఉన్నా, ఆల్ రౌండర్ల విషయానికొస్తే షేన్ వాట్సన్ పేరు ముందుంటుంది. బ్యాట్, బంతితో ఒంటిచేత్తో మ్యాచ్‌ను మార్చేసేవాడు. ఓపెనింగ్‌లో అతని విధ్వంసకర బ్యాటింగ్, వేగవంతమైన బౌలింగ్ ప్రత్యర్థులను భయపెట్టేవి.

66
సనత్ జయసూర్య (శ్రీలంక)
Image Credit : Getty

సనత్ జయసూర్య (శ్రీలంక)

శ్రీలంక క్రికెట్ తన సత్తా చాటడంలో సనత్ జయసూర్య పాత్ర కీలకం. నేటి టీ20 విధ్వంసకర బ్యాటింగ్‌కు అతను ఆద్యుడు. 1996 ప్రపంచకప్‌లో అతని దూకుడును ప్రపంచం చూసింది. మిడిల్ ఓవర్లలో తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో కీలక వికెట్లు తీసి జట్టును ఆదుకునేవాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli : కోహ్లీ దెబ్బకు సచిన్ రికార్డ్స్ షేక్.. ఈ ఒక్కటి మాత్రం ఎవ్వరి వల్లా కాదు !
Recommended image2
18 Sixes In One T20I Innings : 18 సిక్సర్లతో 27 బంతుల్లోనే సెంచరీ.. గేల్, రోహిత్ రికార్డులు బ్రేక్
Recommended image3
Virat Kohli టెన్త్ క్లాస్ మార్కుల మెమో వైరల్.. ఇంతకూ కోహ్లీ ఏ సబ్జెక్ట్ లో తోపు, ఎందులో వీక్..?
Related Stories
Recommended image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Recommended image2
Top 10 Countries : ఆసియాలోనే అత్యంత క్వాలిటీ లైఫ్ కలిగిన 10 దేశాలు.. ఇండియా, పాకిస్థాన్ ల స్థానం ఎంత.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved