హార్దిక్ నుంచి డి కాక్ వరకు: ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన టాప్ 10 ట్రేడ్స్ ఇవే
Most costly trades in IPL history: హార్దిక్ పాండ్యా, కామెరాన్ గ్రీన్, శార్దూల్ ఠాకూర్, ట్రెండ్ బౌల్ట్, క్వింటన్ డీ కాక్.. ఇలా ఐపీఎల్ చరిత్రలో జరిగిన టాప్ 10 ఖరీదైన ఆటగాళ్ల ట్రేడ్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్‌లో ట్రేడింగ్ వ్యూహం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రతి ఏడాది వేలం ముందు, జట్ల మధ్య ఆటగాళ్ల మార్పిడి (ట్రేడ్) కోసం ప్రత్యేక విండోను అందిస్తుంది. ఇది జట్ల వ్యూహాలు, కాంబినేషన్ మార్చే ప్రధాన దశగా చెప్పవచ్చు.
ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ (RR) వంటి జట్లు గతంలో అనేక పెద్ద ట్రేడ్స్ చేశాయి. మొత్తంగా ఐపీఎల్ హిస్టరీలో ప్లేయర్ల టాప్ 10 ట్రేడ్ డీల్స్ వివరాలు గమనిస్తే హార్ధిక్ పాండ్యా టాప్ లో ఉన్నాడు.
KNOW
1. హార్దిక్ పాండ్యా - GT నుంచి MI (2023)
2024 సీజన్‌కు ముందు, గుజరాత్ టైటాన్స్ తమకు టైటిల్ ను అందించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు రూ.15 కోట్లు ఆల్-క్యాష్ డీల్‌లో ట్రేడ్ చేశారు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే పెద్ద ట్రేడ్స్‌లో ఒకటి. కానీ గత రెండు సీజన్లలో MI కెప్టెన్‌గా పాండ్యాకు పెద్ద విజయాలు దక్కలేదు.
2. కామెరూన్ గ్రీన్ - MI నుంచి RCB (2023)
ముంబై ఇండియన్స్, హార్దిక్‌ను తీసుకునేందుకు నిధులు సమకూర్చేందుకు, కామెరూన్ గ్రీన్‌ను రూ.17.5 కోట్లు విలువకు ఆల్‌రౌండర్‌గా ఆర్సీబీకి ఇచ్చింది. ఇది ఖరీదైన ట్రేడ్స్‌లో ఒకటి. 2024 సీజన్‌లో గ్రీన్ 255 పరుగులు, 10 వికెట్లు సాధించాడు.
3. శార్దూల్ ఠాకూర్ - DC నుంచి KKR (2022)
2022లో కోల్‌కతా నైట్ రైడర్స్, శార్దూల్‌ను రూ.10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తీసుకుంది. కానీ 2023 సీజన్‌లో అతను కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు, 113 పరుగులు చేశాడు.
4. ఆవేశ్ ఖాన్ - LSG నుంచి RR (2024)
2024 సీజన్‌కు ముందు, లక్నో సూపర్ జెయింట్స్, ఆవేశ్ ఖాన్‌ను రూ.10 కోట్లకు రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చింది. ఆవేశ్ 2024లో 19 వికెట్లు తీశాడు.
5. హర్షల్ పటేల్ - DC నుంచి RCB (2021)
ఆర్సీబీ హర్షల్ పటేల్‌ను డేనియల్ శామ్స్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి నుంచి తీసుకుంది. 2021లో హర్షల్ 32 వికెట్లు సాధించి, ఒక సీజన్‌లో అత్యధిక వికెట్ల రికార్డును సమం చేశాడు.
6. ట్రెంట్ బౌల్ట్ - DC నుంచి MI (2020)
2020 సీజన్‌కు ముందు, ఢిల్లీ క్యాపిటల్స్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ.3.2 కోట్లకు ముంబై ఇండియన్స్ కు ఇచ్చింది. బౌల్ట్ ఆ ఏడాదే 25 వికెట్లు తీసి ముంబై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
7. అశ్విన్ - PBKS నుంచి DC (2020)
పంజాబ్ కింగ్స్, తమ కెప్టెన్ అశ్విన్‌ను రూ.7.6 కోట్లకు ఢిల్లీకి ట్రేడ్ చేసింది. అతను 13 వికెట్లు తీసి, డీసీని ఫైనల్‌కి తీసుకెళ్లడంలో సహకరించాడు.
8. పార్థివ్ పటేల్ - RCB నుంచి MI (2015)
2015లో ముంబై ఇండియన్స్ పార్థివ్ పటేల్‌ను తీసుకుంది. 2015, 2017 టైటిల్‌లలో అతని ప్రారంభ భాగస్వామ్యం కీలకం అయింది.
9. రాబిన్ ఉతప్ప - RR నుంచి CSK (2021)
2021 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ రాబిన్ ఉతప్పను రాజస్థాన్ రాయల్స్ నుంచి ఆల్-క్యాష్ డీల్‌లో తీసుకుంది. అతను 4 మ్యాచ్‌ల్లో 115 పరుగులు చేసి, CSKకు నాలుగో టైటిల్ గెలిపించడంలో సహకరించాడు.
10. క్వింటన్ డి కాక్ - RCB నుంచి MI (2019)
2019లో ముంబై ఇండియన్స్ క్వింటన్ డి కాక్‌ను రూ.2.8 కోట్లకు ఆర్సీబీ నుంచి తీసుకుంది. 2019, 2020లో అతను వరుసగా 529, 503 పరుగులు చేసి, రోహిత్ శర్మతో ఓపెనింగ్‌లో చెలరేగాడు.