క్రికెట్ హిస్టరీలో భారీ సిక్సర్లు బాదిన టాప్-10 ప్లేయర్లు వీరే
Top 10 Longest Sixes in Cricket History : క్రికెట్ లో ధనాధన్ ఇన్నింగ్స్ లతో పాటు కొడితే బాల్ స్టేడియం దాటి బయటపడిన టాప్-10 భారీ సిక్సర్లు బాదిన టాప్10 ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Top 10 Longest Sixes in Cricket History : క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను మరింత ఉత్తేజకరంగా మార్చడంలో బ్యాట్స్‌మెన్ల పాత్ర కీలకం. ధనాధన్ ఇన్నింగ్స్ లతో పాటు కొడితే బాల్ స్టేడియం దాటి బయటపడిన టాప్-10 భారీ సిక్సర్లు బాదిన టాప్10 ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇజాజ్ అహ్మద్
పెప్సి కప్‌లో భారత ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్న పాకిస్తాన్ ఆటగాడు ఇజాజ్ అహ్మద్ 115 మీటర్ల దూరం సిక్స్ కొట్టాడు.
క్రిస్ గేల్
T20 క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన క్రిస్ గేల్ 2012 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌పై 116 మీటర్ల సిక్స్ కొట్టాడు.
మహేంద్ర సింగ్ ధోని
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2020లో అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ల నుంచి రిటైర్ అయ్యాడు . టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి అన్ని ఐసీసీ ట్రోఫీలను భారత జట్టుకు అందించాడు. 2009లో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్నప్పుడు ఓ వన్డేలో ధోనీ సిక్సర్ దాదాపు 118 మీటర్ల దూరం వెళ్లింది.
యువరాజ్ సింగ్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్ గొప్ప స్ట్రోక్ మాస్టర్‌లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. యువరాజ్ తన ICC T20 ప్రపంచ కప్ 2007లో ఆస్ట్రేలియాపై బ్రెట్ లీ 90mph లెంగ్త్ డెలివరీని వేయగా, దానిని స్క్వేర్ లెగ్ మీదుగా 119 మీటర్ల సిక్సర్ గా మలిచాడు యువరాజ్ సింగ్.
మార్క్ వా
1997లో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా, మార్క్ వా డేనియల్ వెట్టోరీ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాదాడు. WACA మైదానంలో బాదిన ఈ సిక్సర్ ఏకంగా 120 మీటర్ల దూరం వెళ్లింది.
కోరీ అండర్సన్
2014లో కోరీ అండర్సన్ తన ఆటలో పీక్‌లో ఉన్నప్పుడు చేసిన పనిని క్రికెట్ అభిమాని ఎవరూ మర్చిపోలేరు. అతను గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. అతను తక్కువ సమయంలోనే అత్యంత వేగవంతమైన ODI సెంచరీని సాధించాడు. 2014లో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో అండర్సన్ 122 మీటర్ల భారీ సిక్సర్ తో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Biggest Sixes in cricket
లివింగ్‌స్టోన్
లివింగ్‌స్టోన్ 19 ఏప్రిల్ 2015న తన క్లబ్ సైడ్ నాంట్‌విచ్ కోసం 138 బంతుల్లో 350 పరుగులు చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా పేర్కొంటున్నారు. 2016 సీజన్ ప్రారంభ గేమ్‌లో, లివింగ్‌స్టోన్ లాంక్షైర్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. లియామ్ లివింగ్‌స్టోన్ ఇంగ్లాండ్ అత్యంత గౌరవనీయమైన షార్ట్-ఫామ్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. తన అసాధారణమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. గత సంవత్సరం, హెడ్డింగ్లీలో పాకిస్తాన్‌తో జరిగిన రెండవ T20 సమయంలో లివింగ్‌స్టోన్ హారిస్ బౌలింగ్ లో 122 మీటర్ల సిక్స్ కొట్టాడు.
మార్టిన్ గప్టిల్
2012లో దక్షిణాఫ్రికాపై మార్టిన్ గప్టిల్ 127 మీటర్ల సిక్స్ కొట్టాడు. అతను వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన మొదటి న్యూజిలాండ్ ఆటగాడు.
Biggest Sixes
బ్రెట్ లీ
వెస్టిండీస్‌పై బ్రెట్ లీ 130 మీటర్ల సిక్స్ కొట్టాడు. అతను అత్యుత్తమ బౌలర్లలో ఒకరు.
షాహిద్ అఫ్రిది
దక్షిణాఫ్రికాపై షాహిద్ అఫ్రిది 153 మీటర్ల సిక్స్ కొట్టి, అత్యంత దూరం సిక్స్ కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతను అతి వేగవంతమైన వన్డే సెంచరీని కూడా సాధించాడు.