MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ‌ సూప‌ర్ సెంచ‌రీ రికార్డులు ఇవే

తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ‌ సూప‌ర్ సెంచ‌రీ రికార్డులు ఇవే

Tilak Varma century records : దక్షిణాఫ్రికాపై హైద‌రాబాద్ ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ అద్భుత సెంచ‌రీతో దుమ్మురేపాడు. సెంచూరియ‌న్ లో రికార్డుల మోత మోగించాడు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 13 2024, 11:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tilak Varma

Tilak Varma

IND vs SA - Tilak Varma : అద్భుతమైన ఇన్నింగ్స్.. బ్రిలియంట్ గేమ్. 22 ఏళ్ల భారత బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ సెంచూరియన్‌లో దుమ్మురేపాడు. ప్రోటీస్ జ‌ట్టు బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతూ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప‌రుగుల వ‌ర్షం కురిపించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లో రికార్డుల మోత మోగించారు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో హైద‌రాబాద్ యంగ్ ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ అద్భుత‌మైన బ్యాటింగ్ తో సెంచరీ సాధించాడు. 56 బంతులు ఎదుర్కొన్న తిలక్ వ‌ర్మ‌ 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 107 ప‌రుగుల‌ నాటౌట్ గా అద్బుత‌మైన నాక్ ఆడాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Tilak Varma

Tilak Varma

త‌న అంత‌ర్జాతీయ కెరీర్ లో తిలక్ వ‌ర్మ‌ తొలి సెంచ‌రీ 

ఆతిథ్య జ‌ట్టు బౌలర్లను తిల‌క్ వ‌ర్మ‌ చెడుగుడు ఆడుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన మొదటి సెంచరీని పూర్తి చేశాడు. అలాగే, త‌న అంత‌ర్జాతీయ టీ20 కెరీర్ లో ఇదే తొలి సెంచ‌రీ. ఈ మ్యాచ్ లో  తిలక్ వ‌ర్మ‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. అంతేకాదు చివరి వరకు ఆడి నాటౌట్‌గా నిలిచాడు. అతడిని అవుట్ చేయడంలో ఏ బౌలర్ కూడా విజ‌యం సాధించ‌లేక‌పోయాడు. ఈ ఇన్నింగ్స్‌తో తిలక్ వ‌ర్మ‌ ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టాడు.

35

ఫోర్లు, సిక్సర్ల తిల‌క్ వ‌ర్మ ప‌రుగుల‌ తుఫాన్

సెంచూరియ‌న్ లో జ‌రిగిన భార‌త్-సౌతాఫ్రికా మూడో టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు రెండో బంతికే ఖాతా తెరవకుండానే సంజూ శాంసన్ ఔట్ కావడంతో తొలి దెబ్బ తగిలింది. దీని తర్వాత అభిషేక్ శర్మ (50 పరుగులు)కు మద్దతుగా వచ్చిన తిలక్ వర్మ దక్షిణాఫ్రికా బౌలర్లను చిత్తు చేసి సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో టీ20 ఫార్మాట్‌లో,  అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచరీని పూర్తి చేశాడు. అంతేకాదు చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. 56 బంతులు ఎదుర్కొన్న తిలక్ 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 107 నాటౌట్‌గా నిలిచాడు.

45
Tilak Varma

Tilak Varma

ప్రోటీస్ పై సెంచ‌రీ కొట్టిన యంగెస్ట్ ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ‌ 

దక్షిణాఫ్రికాపై టీ20 ఇంటర్నేషనల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయ ప్లేయ‌ర్ గా తిలక్ వర్మ నిలిచాడు. 22 ఏళ్ల 5 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఇది కాకుండా ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున సెంచరీ చేసిన రెండో అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. 21 ఏళ్ల 279 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన యశస్వి జైస్వాల్ నంబర్-1 స్థానంలో ఉన్నాడు.

55
Tilak Varma

Tilak Varma

అంత‌ర్జాతీయ‌ టీ20 క్రికెట్ లో సెంచ‌రీ కొట్టిన తొలి తెలుగు ప్లేయ‌ర్

అంత‌ర్జాతీయ‌ టీ20 క్రికెట్ లో సెంచ‌రీ కొట్టిన తొలి తెలుగు ప్లేయ‌ర్ గా కూడా తిల‌క్ వ‌ర్మ‌ నిలిచాడు. అలాగే, టీ20 క్రికెట్ లో భార‌త్ త‌ర‌ఫున‌ సెంచ‌రీ కొట్టిన తొలి తెలుగు ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. సెంచ‌రీ కొట్టిన తెలుగు యంగెస్ట్ ప్లేయ‌ర్ కూడా తిల‌క్ వ‌ర్మ‌నే. మొత్తంగా తిల‌క్ వ‌ర్మ భార‌త్ త‌ర‌ఫున సెంచ‌రీ కొట్టిన రెండో యంగెస్ట్ ప్లేయ‌ర్ గా నిలిచాడు. తిలక్ వ‌ర్మ‌కు టీ20 కెరీర్ లో ఇదే అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ కావ‌డం విశేషం. తిలక్ వ‌ర్మ దక్షిణాఫ్రికాపై T20I సెంచరీ చేసి 2010లో రైనా సాధించిన రికార్డును బ్రేక్ చేశాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
Recommended image2
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image3
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved