సాలిడ్ నాక్.. భారత్ కు సూపర్ విక్టరీ అందించిన తిలక్ వర్మ
IND vs ENG: తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీ, లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్ కీలక సమయంలో అవసరమైన ఇన్నింగ్స్ తో చెపాక్ లో ఇంగ్లాండ్ పై భారత్ సూపర్ విక్టరీ అందుకుంది.

india vs england: చెన్నైలో నరాలు తెగే ఉత్కంఠను రేపింది భారత్-ఇంగ్లాండ్ రెంటో టీ20 మ్యాచ్. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది.
ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా vs ఇంగ్లాండ్ రెండో మ్యాచ్ చెన్నైటోని చెపాక్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచిజోస్ బట్లర్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్‌పై మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
బౌలింగ్ లో మరోసారి జోరు చూపించిన భారత జట్టు ఇంగ్లాండ్ ను పెద్దగా పరుగులు చేయకుండా అడ్డుకుంది. ఇక బ్యాటింగ్ సమయంలో భారత టాపార్డర్ తడబడింది కానీ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ సూపర్ ఇన్నింగ్స్ లతో భారత్ విజయాన్ని అందుకుంది.
చెన్నైలో బౌలర్ల జోరు
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన రెండవ T20Iలో భారత్ ఇంగ్లాండ్‌ను 165/9 పరుగులకు పరిమితం చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ తొలి నాలుగు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఆరంభం నుంచే కష్టాల్లో పడింది.
ఆ తర్వాత, ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎప్పటికీ సాగకపోవడంతో 7-15 ఓవర్లలో కేవలం 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 45 పరుగులతో మరోసారి జట్టును అదుకున్నాడు. 20 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలు తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ind vs eng 2nd t20
నిరాశపర్చిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్
కోల్ కతాలో జరిగిన తొలి మ్యాచ్ లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతమైన ఆరంభం అందించారు. దీంతో భారత జట్టు చాలా ఈజీగానే విజయాన్ని అందుకుంది. అయితే, చెన్నైలో 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు మంచి ఆరంభం లభించలేదు.
చెపాక్ స్టేడియంలో అభిషేక్ శర్మ సిక్సర్ల మోత మోగలేదు. సంజూ శాంసన్ ఆరంభం అదరలేదు. వీరిద్దరూ త్వరగానే పెవిలియన్ కు చేరారు. అభిషేక్ శర్మ 12 పరుగులు, సంజూ శాంసన్ 5 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్ దీప్, ధృవ్ జురేల్ లు తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేరారు.
సాలిడ్ నాక్.. టీమిండియాకు విక్టరీ అందించిన తిలక్ వర్మ
తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీ, లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్ అవసరమైన ఇన్నింగ్స్ తో చెపాక్ లో ఇంగ్లాండ్ పై భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్న మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ తిలక్ వర్మ చివరి వరకు క్రీజులు ఉండి భారత్ కు విజయాన్ని అందించారు.
ఒంటరి పోరాటం చేసి చెన్నైలో భారత్ కు విక్టరీ అందించారు. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ 72* పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అలాగే, వాషింగ్టన్ సుందర్ 26 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతను 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. చివరలో రవిబిష్ణోయ్ కీలక సమయంలో రెండు బౌండరీలు బాదాడు. ఫోర్ తో తిలక్ వర్మ భారత్ కు విజయం అందించాడు. ఈ గెలుపుతో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది.