అందుకే అడిగిన వారందరికీ ఆటోగ్రాఫ్‌ చేసిన జెర్సీలు ఇచ్చాను... మహేంద్ర సింగ్ ధోనీ!

First Published 2, Nov 2020, 3:37 PM

IPL 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ప్రతీ మ్యాచ్ అనంతరం... ఆటగాళ్లకి తాను ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీలను అందిస్తూ కనిపించాడు మహేంద్రసింగ్ ధోనీ. దీంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన మహేంద్రసింగ్ ధోనీ, ఐపీఎల్ నుంచి రిటైర్ కాబోతున్నాడేమోనని భావించారంతా. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌కి ముందు ఈ విషయమై తానే క్లారిటీ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. అయితే మరి జెర్సీలు ఎందుకు ఇచ్చినట్టు?

‘నేను అనుకోకుండా సడెన్‌గా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాను... క్రికెట్ సీజన్ కాని సమయంలో ఆగస్టు 15న క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాను....

ఐపీఎల్ నుంచి అలాగే అర్ధాంతరంగా వైదొలుతానేమోనని యంగ్ ప్లేయర్లు భావించారు. అలా జరుగుతుందనే భయంతోనే ప్రతీ మ్యాచ్ అనంతరం తన సంతకంతో ఉన్న జెర్సీల కోసం క్యూ కట్టారు...

కానీ అలాంటిదేం లేదు. వచ్చే సీజన్‌లో కూడా క్రికెట్ ఆడతాను... ’ అంటూ క్లారిటీ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...

ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ నుంచి హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి... ఇలా ధోనీ జెర్సీ కోసం చాలా మంది క్యూ కట్టారు...

ధోనీ సంతకం చేసిన జెర్సీని అందుకున్న తర్వాత సంతోషంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు...

చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, సీఎస్‌కే జట్టును 8 సార్లు ఫైనల్ చేర్చాడు...

ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్... ఈసారి ఏడో స్థానానికి పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్ ఆఖరి మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడిపోవడం వల్ల ఆఖరి స్థానానికి పడిపోయింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేలకి పైగా పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్‌లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చిన మహేంద్ర సింగ్ ధోనీ, ఈ సారి సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి సీనియర్లు దూరం కావడంతో చాలా ఇబ్బంది పడ్డాడు.

14 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, 8 ఓటములు మూటకట్టుకుంది. ప్లేఆఫ్ అవకాశాలు దూరమైన తర్వాత మూడు వరుస విజయాలు దక్కడం విశేషం.