మిగిలిన మ్యాచులు ఇక్కడే పెట్టాలనుకున్నాం, కానీ కేవలం ఆ కారణంతోనే యూఏఈకి... బీసీసీఐ సెక్రటరీ జే షా...
ఐపీఎల్ 2021 సీజన్‌కి కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా బ్రేక్ పడింది. ఎట్టకేలకు యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో మిగిలిన మ్యాచులు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. అయితే మిగిలిన మ్యాచులను ఇక్కడే పెట్టాలనుకున్నా, కేవలం వాతావరణం కారణంగానే అక్కడ పెడుతున్నామని చెప్పాడు బీసీసీఐ సెక్రటరీ జే షా.
సెప్టెంబర్ మాసంలో భారత్‌లో వర్షాకాలం ఉంటుంది. వర్షాకాలంలో మ్యాచులు నిర్వహిస్తే, సగం మ్యాచులకు పైగా వర్షం అంతరాయం కలిగించి, ఐపీఎల్ మజాను అందించదు.
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో బీసీసీఐ సెక్రటరీ జే షా, దుబాయ్‌కి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించి ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన మిగిలిన మ్యాచుల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు.
‘మొదట భారత్‌లోనే లీగ్‌ను పూర్తిచేయాలని అనుకున్నాం. దేశంలో కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి కూడా. సెప్టెంబర్ నాటికి సెకండ్ వేవ్ కేసులు చాలా తగ్గొచ్చు. అయితే ఆ సమయంలో ఇక్కడ వర్షాలు మొదలవుతాయి.
దేశంలోని చాలా నగరాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. వర్షాకాలంలో మ్యాచులు నిర్వహించడం చాలా కష్టం. అందుకే గత సీజన్‌లో సరిగ్గా ఇదే సమయంలో ఐపీఎల్ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి అయ్యింది.
అందుకే ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఐపీఎల్ 2021 సీజన్‌ను యూఏఈకి తరలించాం’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ సెక్రటరీ జే షా.
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆసీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి ప్లేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఆయా దేశాల బోర్డులతో చర్చలు జరపడానికి సిద్ధమైంది భారత క్రికెట్ బోర్డు. ఎలాగైనా వారిని ఒప్పించి, ఐపీఎల్‌లో ఫారిన్ ప్లేయర్లను దింపాలని చూస్తోంది.
అయితే ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌కి ముందు జరిగే ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొనడాన్ని మెగా టోర్నీకి ముందు ప్రాక్టీస్‌గా భావిస్తామని ప్రకటించింది ఆస్ట్రేలియా. దీంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్ వంటి ఆసీస్ స్టార్లు ఐపీఎల్ 2021 సీజన్‌లో బరిలో దిగొచ్చు
అయితే కేకేఆర్ స్టార్ ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్ మాత్రం ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొనడం లేదని స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు కూడా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో బిజీగా ఉండబోతున్నాయి.
విండీస్ బోర్డు ప్లేయర్లు, ఇదే సమయంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడతారు. అయితే ఐపీఎల్ 2021 సీజన్ కోసం సీపీఎల్‌ను రెండు వారాలు వాయిదా వేయాల్సిందిగా కోరింది బీసీసీఐ. ఇది జరిగితే క్రిస్ గేల్, పోలార్డ్, రస్సెల్ ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడతారు.