ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు! ఈసారి మిస్ అయితే టీమిండియాకి కష్టమే... - రవిశాస్త్రి
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత జట్టు, ఇప్పటిదాకా అద్భుత ప్రదర్శన కనబరిచింది. లీగ్ స్టేజీలో ప్రతీ జట్టును ఓడించి, అజేయంగా 9 విజయాలతో సెమీస్ చేరింది. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రెండు సార్లు సెమీస్ చేరిన భారత జట్టు, ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని కసిగా ఉంది..
Rohit Sharma-Ravi Shastri
2007 వన్డే వరల్డ్ కప్ గ్రూప్ స్టేజీలో బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిన టీమిండియా, క్వార్టర్ ఫైనల్ కూడా చేరలేకపోయింది. అయితే ఆ తర్వాత నాలుగు ప్రపంచ కప్ టోర్నీల్లోనూ భారత జట్టు మంచి ప్రదర్శన ఇచ్చింది..
2011 వన్డే వరల్డ్ కప్‌లో టైటిల్ గెలిచిన భారత జట్టు, 2015 వన్డే వరల్డ్ కప్‌లో టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరింది. అయితే ఆస్ట్రేలియా చేతుల్లో 95 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో 18 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన ఈ సెమీస్‌లో టీమిండియా టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..
2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో లీగ్ స్టేజీలో పూర్తిగా మిగిలిన జట్లపై ఆధిక్యం చూపించింది భారత్. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ తప్ప భారత జట్టు ఆడిన ప్రతీ లీగ్ మ్యాచ్... వన్ సైడెడ్‌గానే సాగింది..
‘దేశమంతా క్రికెట్ ఫివర్ ఎక్కేసింది. జనాలు వెర్రిగా ఇండియా - న్యూజిలాండ్ సెమీస్ కోసం ఎదురుచూస్తున్నారు. 12 ఏళ్ల క్రితం భారత జట్టు ఇక్కడే వరల్డ్ కప్ గెలిచింది. మళ్లీ ఈసారి టీమిండియాకి టైటిల్ గెలిచే అవకాశం వచ్చింది..
లీగ్ స్టేజీలో వాళ్లు ఆడిన ఆట, చూపించిన ఆధిపత్యం వేరే లెవెల్. ప్రపంచ కప్ గెలిచేందుకు టీమిండియాకి ఇంతకంటే బెస్ట్ ఛాన్స్ మరొకటి రాదు. ఒకవేళ ఈసారి మిస్ అయితే, మళ్లీ వరల్డ్ కప్ గెలిచేందుకు మరో మూడు వరల్డ్ కప్స్ దాకా వేచి చూడాల్సిందే..
భారత జట్టులో 7-8 ప్లేయర్లు పీక్ ఫామ్‌లో ఉన్నారు. చాలామందికి ఇది ఆఖరి వరల్డ్ కప్ కూడా. అందరూ వరల్డ్ కప్ గెలవాలనే కసిగా ఉన్నారు...
భారత జట్టు ఈ పొజిషన్‌కి రావడానికి ఎంతో హార్డ్ వర్క్ జరిగింది. ఒక్క మ్యాచ్‌తో అదంతా వేస్ట్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్లేయర్లపైనే ఉంది.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..