- Home
- Sports
- Cricket
- ఐపీఎల్‌లో అదరగొడతా! టీమిండియాలోకి వచ్చి నా ఆఖరి వన్డే వరల్డ్ కప్ ఆడతా... - టీమిండియా సీనియర్ పేసర్..
ఐపీఎల్‌లో అదరగొడతా! టీమిండియాలోకి వచ్చి నా ఆఖరి వన్డే వరల్డ్ కప్ ఆడతా... - టీమిండియా సీనియర్ పేసర్..
ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలతో యమా బిజీగా గడపబోతోంది టీమిండియా.. ఐపీఎల్ 2023 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి, టీమిండియాలో చోటు దక్కించుకోవాలని చాలా మంది కుర్రాళ్లు ఆశపడుతున్నారు. ఈ లిస్టులో తాను కూడా ఉన్నానని అంటున్నారు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్...
- FB
- TW
- Linkdin
Follow Us
)
జస్ప్రిత్ బుమ్రా, దీపక్ చాహార్ గాయపడడం, భువనేశ్వర్ కుమార్ వరసగా ఫెయిల్ అవుతూ ఉండడంతో 2022 చివర్లో ఆస్ట్రేలయాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఉమేశ్ యాదవ్‌కి చోటు దక్కింది. ఈ సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన ఉమేశ్ యాదవ్, ఆ తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయాడు...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం మొదటి రౌండ్‌లో ఉమేశ్ యాదవ్‌ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. అయితే ఆ తర్వాత రెండో రౌండ్‌లో కేకేఆర్, బేస్ ప్రైజ్‌కి ఉమేశ్ యాదవ్‌ని కొనుగోలు చేసింది...
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో మొదటి ఓవర్ బౌలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్‌ని డకౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 2 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు...
Umesh Yadav
గాయం కారణంగా రెండు మ్యాచులకు దూరమైన ఉమేశ్ యాదవ్, ఐపీఎల్ 2022 సీజన్‌లో 12 మ్యాచులు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. ఈసారి మరింత మెరుగ్గా రాణించి, టీమిండియా తరుపున వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నాడట ఉమేశ్ యాదవ్...
‘వన్డే వరల్డ్ కప్ ప్రతీ నాలుగేళ్లకు ఓసారి మాత్రమే జరుగుతుంది. వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఆడాలంటే ఇదే నాకు ఆఖరి అవకాశం. అయితే టీమ్‌లోకి రావాలంటే ఐపీఎల్‌లో బాగా ఆడాలి. నా పర్ఫామెన్స్ బాగుంటేనే సెలక్టర్లు, నన్ను వన్డే ఫార్మాట్‌కి ఎంపిక చేస్తారు...
Umesh Yadav KKR
వచ్చే వన్డే వరల్డ్ కప్ సమయానికి నేను ఆడకపోవచ్చు. అయితే ఈసారి దక్కిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోవాలని అనుకుంటున్నా. ఈసారి వన్డే వరల్డ్ కప్ ఆడితే ప్రపంచ కప్ ఆడేందుకు మరో నాలుగేళ్లు ఎదురుచూస్తూ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు కదా... ’ అంటూ కామెంట్ చేశాడు ఉమేశ్ యాదవ్...
శ్రేయాస్ అయ్యర్ గాయంతో బాధపడుతూ ఉండడంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో కేకేఆర్‌కి తాత్కాలిక సారథిగా వ్యవహరించబోతున్నాడు నితీశ్ రాణా. కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేని నితీశ్ రాణా, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, షకీబ్ అల్ హసన్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్ వంటి సీనియర్లను ఎలా వాడుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది...