- Home
- Sports
- Cricket
- వాళ్లను చూసైనా టీమిండియా టాపార్డర్ ఓవల్‌లో ఎలా ఆడాలో నేర్చుకోవాలి : రోహిత్, కోహ్లీలకు దాదా చురకలు
వాళ్లను చూసైనా టీమిండియా టాపార్డర్ ఓవల్‌లో ఎలా ఆడాలో నేర్చుకోవాలి : రోహిత్, కోహ్లీలకు దాదా చురకలు
WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో టీమిండియా 152 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినప్పుడు అజింక్యా రహానే.. శార్దూల్ ఠాకూర్ తో కలిసి భారత్ ను ఆదుకున్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత జట్టు విజయం కోసం శ్రమిస్తోంది. ఈ టెస్టులో ఇప్పటికైతే ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉన్నా భారత జట్టుకు కూడా పోరాడగలిగితే గెలిచే అవకాశాలుంటాయి. తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు, టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనా అజింక్యా రహానే.. శార్దూల్ ఠాకూర్ తో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత పలువురు భారత మాజీలు వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా ఇదే విషయమై భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘తొలి ఇన్నింగ్స్ లో రహానే - శార్దూల్‌లు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కు స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. కాస్త లక్ కలిసొచ్చి నిబద్ధతగా ఆడితే ఓవల్ లో పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదని చాటి చెప్పారు.
క్రెడిట్ మొత్తం రహానే కు దక్కాలి. అతడు ముందు జడేజాతో పాటు తర్వాత శార్దూల్ తో సమన్వయం చేసుకుంటే ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఇక శార్దూల్ కూడా చేతికి గాయమైనా అద్భుతంగా పోరాడాడు. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు ఈ ఇద్దరి బ్యాటింగ్ ను చూసి నేర్చుకోవాల్సి ఉంది...’ అని చెప్పాడు.
18 నెలల తర్వాత టెస్టు జట్టులోకి కమ్ బ్యాక్ ఇచ్చి ఓవల్ లో భారత్ ను ఆదుకున్న అజింక్యా రహానే ను దాదా ప్రశంసల్లో ముంచెత్తాడు. బహుశా రహానే ఇది తనకు చివరి ఛాన్స్ అన్న విధంగా ఆడాడని చెప్పుకొచ్చాడు.
‘18 నెలల తర్వాత టెస్టు జట్టులోకి కమ్ బ్యాక్ ఇచ్చిన రహానే అద్భుతంగా ఆడాడు. నేను నా కెరీర్ లో ఎన్నో కమ్ బ్యాక్ లు చూశా. కానీ ఇది మాత్రం అద్భుతం. చాలా మంది రహానే పని అయిపోయిందన్నారు. భారత్ వంటి దేశంలో ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయిన బ్యాటర్ రీఎంట్రీ ఇచ్చి ఇటువంటి ఇన్నింగ్స్ ఆడటం మాములు విషయం కాదు.
అంతేగాక రహానేకు ఇదే చివరి ఛాన్స్ అన్నారు. ఈ మ్యాచ్ లో గనక అతడు ఆడకపోయి ఉంటే ఇక మరెప్పటికీ తిరిగిరాకపోయేవాడు. రహానేకు వయసైపోయిందని, అతడు రిటైర్ అయితే బెటర్ అనే కామెంట్స్ చేసేవాళ్లు. కానీ రహానే వాటన్నింటికీ తన బ్యాట్ ద్వారానే సమాధానం చెప్పాడు’అని రహానేను ప్రశంసల్లో ముంచెత్తాడు.