MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వాళ్లకు విమర్శించడమే తెలుసు.. మేం ఏం చేస్తున్నామనేది మాకు తెలుసు.. : బోర్డర్ విమర్శలకు ఆసీస్ కీపర్ స్పందన

వాళ్లకు విమర్శించడమే తెలుసు.. మేం ఏం చేస్తున్నామనేది మాకు తెలుసు.. : బోర్డర్ విమర్శలకు ఆసీస్ కీపర్ స్పందన

నాగ్‌పూర్ టెస్టులో స్టీవ్ స్మిత్ వ్యవహారశైలిపై  ఆసీస్ మాజీ సారథి అలెన్ బోర్డర్  తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.  స్మిత్.. జడేజా, అశ్విన్ లను బాగా బౌలింగ్ చేసినప్పుడు వారికి బాగా వేశావని ‘థమ్సప్’చూపించడం ఆయనకు కోపం తెప్పించింది. 

2 Min read
Author : Srinivas M
Published : Feb 14 2023, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య  నాగ్‌పూర్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో కంగారూలు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ టెస్టులో భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్,  రవీంద్ర జడేజా,   అక్షర్ పటేల్ ల  స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ఆసీస్.. రెండు ఇన్నింగ్స్ లలో దారుణంగా విఫలమైంది.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరీ ముఖ్యంగా భారత్ లో మంచి రికార్డు ఉన్న స్టీవ్ స్మిత్..  స్పిన్ ను బాగా ఆడగలడన్న  పేరున్న లబూషేన్ లతో పాటు  మిడిలార్డర్ బ్యాటర్లు హ్యాండ్స్‌కాంబ్, అలెక్స్ క్యారీలు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఒక్క ఆసీస్ బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయకపోవడం గమనార్హం. 

36

ఇదిలాఉండగా ఈ టెస్టులో స్టీవ్ స్మిత్ వ్యవహారశైలిపై  ఆసీస్ మాజీ సారథి అలెన్ బోర్డర్  తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.  స్మిత్..  ఈ టెస్టులో జడేజా, అశ్విన్ లను బాగా బౌలింగ్ చేసినప్పుడు వారికి బాగా వేశావని ‘థమ్సప్’చూపించడం బోర్డర్ కు కోపం తెప్పించింది. ఏం సాధించావని అలా థమ్సప్ చూపిస్తున్నావని  బోర్డర్ విమర్శలు చేశాడు. 

46

బోర్డర్ మాట్లాడుతూ.. ‘భారత పిచ్‌లపై ఎడ్జ్ రాకుండా బ్యాటింగ్ చేయాలి. భారత స్పిన్నర్లు ఆఫ్ స్టంప్ అవతల బాల్ వేసి, నిన్ను బీట్ చేసిన ప్రతీసారి వాళ్లకు థమ్సప్ చూపిస్తున్నావు. అసలు ఇదేం పిచ్చి. బుద్ధి ఉండే ఈ పని చేస్తున్నావా. ఆస్ట్రేలియా ఎప్పుడూ అగ్రెసివ్ క్రికెట్ ఆడుతుంది. 

56

ప్రత్యర్థి బౌలర్లకు థమ్సప్ ఇవ్వడమనేది చెత్త పని. ఆ సమయంలో నీ వీక్‌నెస్ బౌలర్లకు అర్థమైపోతోంది. ఇండియా టూర్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా మూడు టెస్టులు ఆడాలి. చాలా కఠినమైన పిచ్‌లను ఫేస్ చేయాలి..’అని అన్నాడు.

66

ఈ కామెంట్స్ పై తాజాగా  ఆ జట్టు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ స్పందించాడు.  బోర్డర్ ను తాము గౌరవిస్తామని,  కానీ  ఇక్కడ ఏం  జరుగుతుందనేది  విమర్శకులకు తెలియదని  చెప్పాడు. క్యారీ మాట్లాడుతూ... ‘మేం అలెన్ బోర్డర్ ను గౌరవిస్తాం. ఆయన లెజెండ్. బయట నుంచి కామెంట్స్ చేసేవాళ్లకు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతుందో తెలియదు.  మేం  భిన్నంగా ఆడేందుకు యత్నిస్తూనే ఉన్నాం.. కొన్నికొన్నిసార్లు  పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవచ్చు...’అని  తెలిపాడు. 

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
Team India squad: శ్రీలంకతో బిగ్ ఫైట్.. టీమిండియాలో భారీ మార్పులు.. 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు లక్కీ ఛాన్స్ !
Recommended image2
రెచ్చిపోయిన యువ ఆటగాళ్లు.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
Recommended image3
Zimbabwe vs India: మరోసారి మెరిసిన వైభ‌వ్‌.. కొద్దిలో సెంచ‌రీ మిస్, టీమిండియా స్కోర్ ఎంతంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved