ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లే లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 క్రికెటర్లు వీరే..
IPL power play Top-5 players with most sixes: టీ20 క్రికెట్ ఐపీఎల్ ధనాధన్ హిట్టింగ్ పెట్టిందిపేరు. ముఖ్యంగా ఐపీఎల్ లో దుమ్మురేపిన ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. అయితే, ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు పవర్ ప్లే ఓవర్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-5 క్రికెటర్ల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి..
Rohit Sharma, Chris Gayle, David Warner,
క్రిస్ గేల్
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ ఐపీఎల్ లో తన బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ ను మించిన మంచి ఎంటర్‌టైనర్ మరొకరు లేరు. ఆర్సీబీ, పంజాబ్ సహా పటు జట్ల తరఫున ఆడిన క్రిస్ గేల్ ఐపీఎల్ పవర్ ప్లే ఓవర్లలో ఏకంగా 138 సిక్సర్లు బాదాడు.
David Warner
డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ సహా పలు టీమ్ లకు ఆడాడు. పవర్ హిట్టింగ్ కు పేరుగాంచిన, హైదరాబాద్ టీమ్ కు టైటిల్ ను అందించిన వార్నర్ భాయ్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లలో ఒకడు. తన ఐపీఎల్ కేరీర్ లో పవర్ ప్లే లో 96 సిక్సర్లు బాదాడు.
Rohit Sharma
రోహిత్ శర్మ
ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. ముంబై టీమ్ కు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. ప్రస్తుత సీజన్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హిట్ మ్యాన్ బ్యాటర్ గా బరిలోకి దిగనున్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్ పవర్ ప్లే లో ఇప్పటివరకు 77 సిక్సర్లు బాదాడు.
शिखर धवन
శిఖర్ ధావన్
టీమింయా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ హైదరాబాద్, పంజాబ్, ఢిల్లీ వంటి జట్ల తరఫున ఆడాడు. ప్రస్తుతం పంజాబ్ టీమ్ కు ఆడుతున్న ఈ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ పవర్ ప్లే ఓవర్లలో 72 సిక్సర్లు బాదాడు.
బ్రెండన్ మెకల్లమ్
కీవీస్ స్టార్ ప్లేయర్ బ్రెండన్ మెకల్లమ్ తన ఐపీఎల్ కేరీర్ లో పవర్ ప్లే ఓవర్లలో మొత్తం 70 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ లో 2 సెంచరీలతో పాటు 15 హాఫ్ సెంచరీలు సాధించాడు.
క్వింటన్ డి కాక్
క్వింటన్ డి కాక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కు ఆడాడు. క్వింటన్ డి కాక్ గత సీజన్‌లో ఫ్రాంచైజీ రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కు మారాడు. తన ఐపీఎల్ కెరీర్ లో పవర్ ప్లే లో 69 సిక్సర్లు బాదాడు.
కేఎల్ రాహుల్
టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఉన్నాడు. అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కేఎల్ రాహుల్ ఐపీఎల్ పవర్ ప్లేలో 64 సిక్సర్లు బాదాడు.