అన్ని ఫార్మాట్ లలో సెంచరీలు కొట్టిన ముగ్గురు భారత క్రికెటర్స్ వీరే !
Indian cricketers: క్రికెట్ అంటేనే బాల్, బ్యాట్ తో అదరగొట్టే గేమ్. అయితే, ఆటగాళ్లకు క్రికెట్‌లోని ప్రతి ఫార్మాట్‌లో పరుగుల వరద పారించడం సవాలుతో కూడుకున్నపనే. కానీ, భారత బ్యాటర్స్ అయిన సురేష్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ముగ్గరు ప్లేయర్లు టెస్టు, వన్డే, టీ-20, ఐపీఎల్ లో ధనాధన్ ఇన్నింగ్స్ లతో అదరగొట్టి సెంచరీల మోత మోగించారు.
Centuries in all formats: కొంతమంది ఆటగాళ్లు టెస్టుల్లో మెరుగ్గా రాణిస్తుంటారు. మరికొంతమంది వన్డేల్లో.. ఇంకొంత మంది టీ20ల్లో రాణించడం చూస్తున్నాం. క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌కు కూడా విభిన్న ప్రత్యేకతలు ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే మూడు ఫార్మాట్ లలో ప్రత్యేక ఇన్నింగ్స్ లు ఆడిన ప్లేయర్లు ఉన్నారు.
Rahul-Rohit
టెస్టు నుంచి ఐపీఎల్ వరకు పరుగులవరద పారించిన ప్లేయర్లు ఉన్నారు. భారత జట్టులో ఇప్పటి వరకు ముగ్గురు బ్యాట్స్‌మెన్లు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో అంటే టెస్ట్, వన్డే, టీ20, ఐపీఎల్ లలో సెంచరీలు మోత మోగించారు.
century raina
క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 1, వన్డేల్లో 5, టీ20లో 1 సెంచరీతో పాటు ఐపీఎల్‌లో కూడా సురేష్ రైనా సెంచరీ సాధించాడు.
rohit 7
టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్నాడు. రోహిత్ టీ20లో 4 సెంచరీలు, టెస్టులో 8 సెంచరీలు, వన్డేల్లో 29 సెంచరీలు, ఐపీఎల్‌లో ఒక సెంచరీ చేశాడు.
KL Rahul
భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ క్రికెట్‌లోని ప్రతి ఫార్మాట్‌లో తన అద్భుతమైన ఆటను కొనసాగిస్తున్నాడు. అతను కూడా అన్ని ఫార్మాట్ లలో సెంచరీలు బాదాడు. రాహుల్ టెస్టులో 7, వన్డేల్లో 5, టీ20లో 2 సెంచరీలతో పాటు ఐపీఎల్‌లో నాలుగు సెంచరీలు సాధించాడు.