ఓడినా సరే, మా బ్యాటింగ్ స్ట్రాటెజీ మారదు... స్పష్టం చేసిన శ్రేయాస్ అయ్యర్...
టెస్టు సిరీస్ విజయం ఇచ్చిన అత్యుత్సాహమో లేక, టెస్టు సిరీస్ తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి రావడానికి తీసుకున్న అలసత్వమో తెలీదు కానీ తొలి టీ20 మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది భారత జట్టు. అయినా ఓడినా, టీమిండియా బ్యాటింగ్ స్ట్రాటెజీ మారదంటున్నాడు శ్రేయాస్ అయ్యర్.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెఎల్ రాహుల్ 1, శిఖర్ ధావన్ 4, విరాట్ కోహ్లీ డకౌట్ కాగా రిషబ్ పంత్ 21, హార్ధిక్ పాండ్యా 19 పరుగులు చేశారు...

బ్యాటింగ్ టాపార్డర్ ఘోరంగా ఫెయిల్ అయినప్పటికీ శ్రేయాస్ అయ్యర్ 48 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 67 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ కారణంగా ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది భారత జట్టు...

‘ఓడినా సరే, మా బ్యాటింగ్ స్ట్రాటెజీలో ఎలాంటి మార్పు ఉండదు. టీమిండియాకి ఆడేటప్పుడు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చినా రాణించడమే ముఖ్యమని భావించాను...

పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయాలని భావించాను. ఈరోజు పరిస్థితులు బ్యాటింగ్‌కి కష్టంగా మారాయి. త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం వల్ల భారీ స్కోరు చేయలేకపోయాం...

భారత జట్టుకు మంచి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. మంచి హిట్టర్లు కూడా ఉన్నారు... మ్యాచ్‌కి ముందు ఈ పిచ్ స్పిన్‌కి అనుకూలిస్తుందని భావించాం. అందుకే ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం ఇచ్చాం...’ అంటూ చెప్పుకొచ్చాడు శ్రేయాస్ అయ్యర్.

భారత జట్టు ఓటమిపై స్పందించిన భారత సారథి విరాట్ కోహ్లీ... ‘మేం పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాం. పిచ్ పేస్‌కి చక్కగా సహకరిస్తోంది. షాట్ల ఎంపికలో మేం చేసిన తప్పులు, ఇంగ్లాండ్‌కి కలిసొచ్చాయి.

టీ20 వరల్డ్‌కప్‌కి ముందు ఈ ఐదు మ్యాచులు కొన్ని ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నాం. కానీ ఇంగ్లాండ్ జట్టును తక్కువ అంచనా వేయం. ఈ పిచ్‌పైన ఎలా బ్యాటింగ్ చేయాలో శ్రేయాస్ అయ్యర్ చేసి చూపించాడు...

త్వరగా వికెట్లు కోల్పోకుండా ఉండి ఉంటే, కచ్ఛితంగా 150, 160 స్కోరు వచ్చి ఉండేది... తర్వాత మ్యాచ్‌లో మంచి కమ్ బ్యాక్ ఇస్తాం...’ అంటూ చెప్పాడు విరాట్ కోహ్లీ.