- Home
- Sports
- Cricket
- రాహుల్‌కి అంత సీన్ లేదు! అందుకే తీసేశారు! టీమిండియా నెక్ట్స్ టెస్టు కెప్టెన్ అతనే...
రాహుల్‌కి అంత సీన్ లేదు! అందుకే తీసేశారు! టీమిండియా నెక్ట్స్ టెస్టు కెప్టెన్ అతనే...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 సీజన్‌లో టీమిండియా ఆటతీరు కంటే కెఎల్ రాహుల్ పేలవ ఫామ్ గురించే ఎక్కవ చర్చ నడుస్తోంది. కారణం సూపర్ హాట్ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి ఏడాదిన్నరగా ఫెయిల్ అవుతున్న కెఎల్ రాహుల్‌ని కొనసాగిస్తుండడమే...

KL Rahul
రోహిత్ గాయం కారణంగా తప్పుకోవడంతో బంగ్లాదేశ్ టూర్‌లో టెస్టు సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు కెఎల్ రాహుల్. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టులు ముగిసిన తర్వాత కెఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
KL Rahul-Dravid
రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్సీ కెఎల్ రాహుల్‌కే దక్కుతుందని బీభత్సంగా ప్రచారం జరిగింది. వైట్ బాల్ కెప్టెన్సీని హార్ధిక్ పాండ్యాకి ఇచ్చి, టెస్టు కెప్టెన్సీ పగ్గాలు రాహుల్‌కి ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు ఫిక్స్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇంతలో రాహుల్‌ని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
KL Rahul
‘మిగిలిన రెండు టెస్టులకు వైస్ కెప్టెన్‌ని ప్రకటించకపోవడానికి ఓ కారణం ఉంది. అందరూ కూడా రిషబ్ పంత్ రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే టెస్టుల్లో వైస్ కెప్టెన్సీకి అతనే సరైన వ్యక్తి... రిషబ్ పంత్‌కి ఆ పొజిషన్ దక్కి తీరుతుంది కూడా...
Rishabh Pant
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ టెస్టుల్లో కొనసాగుతాడా? లేదా చెప్పడం కష్టం... రోహిత్ తప్పుకుంటే వచ్చే రెండేళ్లు టీమిండియాని టెస్టుల్లో నడిపించే సారథిని ఎంచుకోవాల్సి ఉంటుంది. టీమిండియా నెక్ట్స్ కెప్టెన్సీ రేసులో నాకు తెలిసి ఇద్దరే ఉన్నారు...
Image credit: Getty
రవీంద్ర జడేజా, రిషబ్ పంత్. రవీంద్ర జడేజా గురించి చెప్పాలంటే అతను తరుచూ గాయాలతో బాధపడుతున్నాడు. రిషబ్ పంత్‌కి అలాంటి సమస్య లేదు. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్‌లో గాయపడ్డాడు కానీ అంతకుముందు గాయాలతో టీమ్‌కి దూరమైన సందర్భాలు చాలా తక్కువ...
కెఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ఇదే కారణం. టెస్టుల్లో టీమ్‌ని నడిపించడానికి కావాల్సిన అర్హతలు అతనిలో లేవని బీసీసీఐ గ్రహించింది. అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కినా దక్కకపోయినా పెద్ద విషయం కాదు...
Image credit: PTI
వైస్ కెప్టెన్ పదవిలో ఉన్నవాడు పరుగులు చేసి, టీమ్‌ని విజయపథంలో నడిపించాలి. కెఎల్ రాహుల్‌కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే భారత జట్టు గెలుస్తోంది. అదే ఓడిపోయి ఉంటే రాహుల్ ఇప్పటికే రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి వచ్చేది. అప్పుడు అతనికి ఎలాంటి సపోర్ట్ దక్కి ఉండేది కాదు..’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం..