వన్డే రేసు మొదలైంది... ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023కి నేరుగా అర్హత సాధించిన ఏడు జట్లు ఇవే...
టీ20 వరల్డ్ కప్ టోర్నీలు ముగిశాయి. ఇక వన్డే వరల్డ్ కప్ హంగామా మొదలైపోయింది. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఏడు జట్లు నేరుగా అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న మిగిలిన ఆరు జట్లలో మరో టీమ్‌కి మాత్రమే వరల్డ్ కప్‌కి నేరుగా అర్హత సాధించే ఛాన్స్ ఉంది...
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓడినప్పటికీ టేబుల్ టాపర్‌గా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధంచింది టీమిండియా. వాస్తవానికి వచ్చే ప్రపంచకప్‌కి ఆతిథ్యమిస్తున్న భారత జట్టు, హోస్ట్ కంట్రీగా పాయింట్లతో సంబంధం లేకుండానే వరల్డ్ కప్‌కి క్వాలిఫై అవుతుంది. 134 పాయింట్లతో వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది టీమిండియా...
england
2019 వన్డే వరల్డ్ కప్ విజేత, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ గెలిచిన ఇంగ్లాండ్, 18 వన్డేలు ఆడి 125 పాయింట్లతో వరల్డ్ కప్‌కి అర్హత సాధించింది. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌కీ, టాప్‌లో ఉన్న ఇండియాకి 9 పాయింట్ల తేడా ఉంది. ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు, డిసెంబర్ 1 నుంచి మూడు టెస్టులు ఆడనుంది..
17 వన్డేలు ఆడి 125 పాయింట్లు సాధించిన న్యూజిలాండ్ జట్టు, మూడో స్థానంలో నిలిచి వరల్డ్ కప్‌కి క్వాలిఫై అయ్యింది. న్యూజిలాండ్, టీమిండియాపై సిరీస్ గెలిస్తే... ఇంగ్లాండ్‌ని వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకుతుంది..
Australia
18 మ్యాచులు ఆడిన ఆస్ట్రేలియా, 120 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి వన్డే వరల్డ్ కప్‌కి అర్హత సాధించింది. ఐదు వన్డే వరల్డ్ కప్స్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు, ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. విండీస్‌తో రెండు టెస్టులు ఆడే ఆసీస్, ఆ తర్వాత సౌతాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుంది...
bangladesh
బంగ్లాదేశ్ జట్టు కూడా 18 మ్యాచులు ఆడి 120 పాయింట్లతో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. బంగ్లా తర్వాతి స్థానంలో ఉన్న పాకిస్తాన్ కూడా 120 పాయింట్లతో ప్రపంచకప్‌కి క్వాలిఫై అయ్యింది. ఆసియా కప్ 2023 టోర్నీ విషయంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య వైరం నడుస్తోంది..
షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో జరగాల్సిన ఆసియా కప్ 2023 టోర్నీకి టీమిండియా రాకపోతే, తాము భారత్‌లో అడుగుపెట్టేది లేదని స్పష్టం చేసింది పీసీబీ. దీంతో వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా? మాట మీద నిలబడి, టోర్నీ నుంచి తప్పుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది...
ఆఫ్ఘనిస్తాన్ 14 వన్డేలు ఆడి 115 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. వెస్టిండీస్, ఐర్లాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్ల మధ్య మరో ప్లేస్ కోసం పోటీజరుగుతోంది. ప్రస్తుతం 88 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్, సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ గెలిస్తే... వరల్డ్ కప్‌కి నేరుగా అర్హత సాధించగలుగుతుంది...
sri lanka
ఐర్లాండ్ 68, శ్రీలంక 67, సౌతాఫ్రికా 59 పాయింట్లతో 9, 10, 11వ స్థానాల్లో ఉండగా ఆఖరి రెండు స్థానాల్లో ఉన్న జింబాబ్వే 45, నెదర్లాండ్స్ 25 పాయింట్లు సాధించాయి. వీటిల్లో ఐర్లాండ్, శ్రీలంక (చాలా తక్కువ ఛాన్స్) మినహా మిగిలిన జట్లు నేరుగా వరల్డ్ కప్‌కి క్వాలిఫై అవ్వడం కష్టమే...