MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • ఈ ఐదుగురు భారత ప్లేయ‌ర్ల వ‌న్డే కెరీర్ ముగిసిన‌ట్టేనా?

ఈ ఐదుగురు భారత ప్లేయ‌ర్ల వ‌న్డే కెరీర్ ముగిసిన‌ట్టేనా?

Team India : శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 జట్టు ఆడనుంది. వన్డే జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ కొన‌సాగ‌నున్నాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jul 20 2024, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ravichandran Ashwin, Ravindra Jadeja, Bhuvneshwar Kumar

Ravichandran Ashwin, Ravindra Jadeja, Bhuvneshwar Kumar

Team India : శ్రీలంక ప‌ర్య‌ట‌న కోసం బీసీసీఐ ప్ర‌క‌టించిన భార‌త జ‌ట్టులో మరోసారి చాలా మంది వెటరన్ ఆటగాళ్లకు చోటుద‌క్క‌లేదు. మొన్నటి వరకు జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్లు ఇప్పుడు ఔట్ అయ్యారు. దాదాపు వీరి వ‌న్డే కెరీర్ ముగిసింద‌నే సంకేతాలు అందుతున్నాయి. భార‌త వ‌న్డే జ‌ట్టులో అవ‌కాశం దొరకడం కష్టంగా ఉన్న స్టార్ ల‌లోని టాప్-5 ప్లేయ‌ర్ల‌ను గ‌మ‌నిస్తే.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రవిచంద్రన్ అశ్విన్

భారత బౌలర్లలో అశ్విన్ అత్యంత అనుభవజ్ఞుడు. టీమిండియా తరఫున 116 వన్డేల్లో 156 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో సిరీస్‌కు అశ్విన్‌ను ఎంపిక చేయలేదు. గతేడాది ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున ఆడాడు. 37 ఏళ్ల అశ్విన్‌ మళ్లీ వన్డే జట్టులోకి రావడం క‌ష్టమే. 

36

రవీంద్ర జడేజా

భారత దిగ్గజ ఆల్‌రౌండర్లలో ఒక‌రైన రవీంద్ర జడేజా కూడా శ్రీలంక పర్యటనకు ఎంపిక కాలేదు. భారత్ తరఫున 197 మ్యాచ్‌లు ఆడాడు. 220 వికెట్లు తీశాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జడేజా ఆడాడు. 35 ఏళ్ల ఈ ఆటగాడిని ఇప్పుడు వన్డే జ‌ట్టు నుంచి త‌ప్పించారు. జ‌డేజా స్థానంలో మ‌రో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ప్రాధాన్యం లభించింది.

46

భువనేశ్వర్ కుమార్

ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు మ‌రోసారి నిరాశే మిగిలింది. భువనేశ్వర్ 2022 నుంచి టీమ్ ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు. చివ‌ర‌గా జనవరి 2022లో దక్షిణాఫ్రికాతో వ‌న్డే మ్యాచ్ ను ఆడాడు. 121 వన్డేల్లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 141 వికెట్లు తీసుకున్నాడు. జ‌ట్టులోకి వ‌స్తున్న కొత్త ఫాస్ట్ బౌల‌ర్ల‌ను గ‌మ‌నిస్తే ఇప్ప‌ట్లో భువ‌నేశ్వ‌ర్ జ‌ట్టులోకి రావ‌డం క‌ష్ట‌మే. 

56

కృనాల్ పాండ్యా

ఒకవైపు టీ20 ప్రపంచకప్‌తో హార్దిక్ పాండ్యా స్టార్ గా మ‌రో ఎత్తు పైకెళ్తే.. మరోవైపు అతని సోదరుడు కృనాల్ పాండ్యా అదృష్టం మాత్రం వెలగడం లేదు. కృనాల్ చాలా కాలంగా వన్డే జట్టులోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాడు. కృనాల్‌కు కేవలం 5 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. అతను 2021లో అరంగేట్రం చేసాడు. అదే సంవత్సరంలో తన చివరి మ్యాచ్ ఆడాడు. 33 ఏళ్ల కృనాల్ పాండ్యా కూడా వ‌న్డే జ‌ట్టులోకి రావ‌డం దాదాపు క‌ష్ట‌మ‌నే చెప్పాలి. 

66

మయాంక్ అగర్వాల్

స్టైలిష్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా వన్డే జ‌ట్టునుంచి ఔట్ అయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మయాంక్ కొట్టే షాట్‌ల‌ను క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంత‌గానో ఇష్టపడతారు, కానీ వ‌రుస‌గా పేలవమైన ఫామ్ కారణంగా అత‌ను జ‌ట్టు నుంచి ఔట్ అయ్యాడు. ఇప్ప‌టివ‌ర‌కు 5 వన్డేల‌ను ఆడాడు. 2020లో అరంగేట్రం చేసిన ఈ ప్లేయ‌ర్ చివ‌ర‌కు అదే ఏడాదితో భార‌త వ‌న్డే జ‌ట్టుకు ఆడాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved