ఐదు రోజులు ఆడే టెస్టు మ్యాచ్ కేవలం 62 బంతుల్లోనే ముగిసింది - క్రికెటర్ల రక్తమోడిన మ్యాచ్ ఇది
Test match ended in just 62 balls : టెస్టు మ్యాచ్ అంటే సాధారణంగా నాలుగైదు రోజులు ఆడుతారు. కొన్ని మ్యాచ్ లు నాలుగు రోజుల్లో.. మరికొన్ని టెస్టు మ్యాచ్ లు మూడు రోజుల్లోనే ముగుస్తాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టెస్టు మ్యాచ్ కేవలం 62 బంతుల్లోనే ముగిసింది. చరిత్రలో క్రికెటర్ల రక్తమోడిన మ్యాచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Test match ended in just 62 balls : టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1998లో ఏవరూ ఊహించని రికార్డు నమోదైంది. నాలుగైదు రోజుల్లో పూర్తి కావాల్సిన మ్యాచ్ కేవలం 62 బంతుల్లోనే ముగిసింది. అతి తక్కువ సమయంలో పూర్తియిన మ్యాచ్ గా ఇది నిలిచింది. వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది.
ఇప్పటివరకు అతితక్కువ సమయంలో పూర్తయిన మ్యాచ్ రికార్డు వెస్టిండీస్-ఇంగ్లండ్ మ్యాచ్ పైనే ఉంది. భయంకరమైన పిచ్ కారణంగా ఆటగాళ్లు బ్యాటింగ్ చేయడానికి బెంబేలెత్తిపోయారు. పరుగుల కంటే తమను తాము రక్షించుకోవడమే మొదటి ప్రాధ్యనతగా మారింది.
అయినా చాలా మంది ఆటగాళ్లు తీవ్ర గాయాలపాలు అయ్యారు. ఆటగాళ్ల రక్తమోడుతున్న క్రమంలో వారి ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున ఈ టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రమాదకరమైన ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్స్‌మెన్ రక్తమోడుతూ ప్రాణాలు కాపాడుకోవడం కనిపించింది.
West Indies vs England
ఈ టెస్టు మ్యాచ్‌కు వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వగా, ఈ మ్యాచ్ సబీనా పార్క్ స్టేడియంలో జరిగింది. పర్యాటక జట్టు ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది, కానీ పిచ్ చాలా భయంకరంగా మారింది. వెస్టిండీస్ బౌలింగ్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రక్తం చిందించాల్సి వచ్చింది.
కెప్టెన్ మైక్ ఎర్త్‌టన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అలెక్ స్టీవర్ట్ ఇంగ్లండ్‌కు ఒపెనింగ్ బ్యాటర్స్ గా గ్రౌండ్ లోకి వచ్చారు. వెస్టిండీస్ ఆ సమయంలో ప్రమాదకరమైన బౌలింగ్‌కు పేరుగాంచింది. కర్ట్లీ ఆంబ్రోస్-కోర్ట్నీ వాల్ష్ వెస్టిండీస్ తరపున బౌలింగ్ చేయడానికి వచ్చారు.
ఈ ఇద్దరు బౌలర్లు బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పుడు, ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ భయపడిపోయారు. అత్యంత వేగవంతమైన బంతుల మధ్య ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు తమ ప్రాణాలను కాపాడుకోవలసి వచ్చింది.
ఈ టెస్టు మ్యాచ్ కేవలం 10 ఓవర్లలోనే ముగిసింది. ఆ రోజు సబీనా పార్క్ స్టేడియం పిచ్‌పై భిన్నమైన బౌన్స్ తో పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంది. అయితే, అధిక బౌన్స్ తో బంతులు వేగంగా దూసుకురావడంతో బంతులు నేరుగా బ్యాట్స్‌మెన్ శరీరాన్ని తాకుతున్నాయి.
westindies
దీంతో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌తో సహా ఇతర ఆటగాళ్లు కూడా గాయపడ్డారు. పిచ్ చాలా ప్రాణాంతకంగా మారింది. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ రక్తమోడారు.
ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఆన్-ఫీల్డ్ అంపైర్లు స్టీవ్ బక్నర్-శ్రీనివాస్ వెంకటరాఘన్ మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అంపైర్ ఈ నిర్ణయం తీసుకునే సమయానికి చాలా ఆలస్యం అయింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ల శరీరాలు గాయాల గుర్తులతో నిండిపోయాయి.
బ్యాటింగ్ చేయడానికి వచ్చిన అందరూ తీవ్రంగా గాయపడ్డాడు. పిచ్ చాలా అధ్వాన్నంగా ఉంది, అంపైర్లు కేవలం 62 బంతుల్లో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది, మ్యాచ్ కేవలం 10.2 ఓవర్లలో ముగిసింది. ఇందులో ఇంగ్లాండ్ మొత్తం 3 వికెట్లు కోల్పోయి 17 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత పొట్టి మ్యాచ్ గా నిలిచింది.