ఫిట్‌గా లేకపోతే ఐపీఎల్ కూడా ఆడనిచ్చేది లే... సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు బీసీసీఐ షాక్...
ఐపీఎల్ 2020 సీజన్ నాటి సంగతి. గాయం కారణంగా మూడు మ్యాచులకు దూరమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, గాయం పూర్తిగా మానకముందే మళ్లీ బరిలో దిగాడు. నాకౌట్ మ్యాచుల్లో బరిలో దిగడంతో రోహిత్ గాయం మళ్లీ తిరగబెట్టింది...
ఈ కారణంగానే ఆస్ట్రేలియా టూర్‌కి రోహిత్ శర్మ లేకుండానే వెళ్లాల్సి వచ్చింది భారత జట్టు. రోహిత్ గాయం నుంచి కోలుకుని, భారత జట్టుకి అందుబాటులోకి వచ్చే సమయానికి బాగా ఆలస్యమైంది...
ఐపీఎల్ 2021 సీజన్‌లో హార్ధిక్ పాండ్యా విషయంలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఎదురైంది. పాండ్యా పూర్తి ఫిట్‌గా లేకపోయినా అతన్ని టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆడించడం భారత జట్టు విజయావకాశాలను ఘోరంగా దెబ్బతీసింది...
అందుకే ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ పెడుతోంది భారత క్రికెట్ బోర్డు. ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు భారత సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లు అందరూ ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ క్యాంపులో పాల్గొనాలని ఆదేశించింది బీసీసీఐ...
వాస్తవానికి ఐపీఎల్ ఆరంభానికి ముందు ప్లేయర్లు అంతా కలిసి ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసే క్యాంపుల్లో పాల్గొంటూ యమా బీజీగా ఉంటారు. అయితే ఈసారి మాత్రం బీసీసీఐ రూటు మార్చింది...
74 రోజుల పాటు సాగే సుదీర్ఘ లీగ్ కావడం, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కూడా ఉండడంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ పెట్టింది బీసీసీఐ...
‘ద్వైపాక్షిక సిరీస్‌లు, అంతర్జాతీయ మ్యాచులకు ముందు ఆటగాళ్లు ఫిట్‌గా ఉండేలా చూడడం మా కర్తవ్యం. ఈసారి ఐపీఎల్ విషయంలోనూ ఫిట్‌నెస్ క్యాంపు నిర్వహిస్తున్నాం...
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు అందరూ ఈ క్యాంపులో పాల్గొని, ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి...
హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ 10 నెలల పాటు భారత జట్టుకు అందుబాటులో ఉంటారు, కేవలం రెండు నెలలు మాత్రమే ఐపీఎల్ జరుగుతుంది. అందుకే ఎన్‌సీఏపై పూర్తి నమ్మకంతో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా సూచించారు...
కొంతమంది ప్లేయర్లు, ఐపీఎల్ ముందు ఎన్‌సీఏలో ఉండాలంటే ఫ్రాంఛైజీలు, ఫిజియోలు ఒప్పుకోరని కామెంట్ చేశారు. అయితే టీమిండియాకి ఆడడం కంటే ఏదీ పెద్దది కాదని చెప్పేశాం...
ఫిట్‌గా లేకపోతే ఐపీఎల్‌లో ఆడడానికి కూడా అవకాశం ఉండదు. ఆటగాళ్ల ఫిట్‌నెస్, గాయాలపై సమగ్ర అవగాహన అధికారులకు ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కి అందుబాటులో లేని కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ వంటి ప్లేయర్లు ఎన్‌సీఏలో బీసీసీఐ ఫిట్‌నెస్ క్యాంపులో పాల్గొంటున్నారు.